Asianet News TeluguAsianet News Telugu

చంద్రగ్రహణం: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 8 గంట‌లు మూసివేయనున్న తిరుమల ఆలయం

lunar eclipse: పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం నేప‌థ్యంలో తిరుమల శ్రీవారి ఆల‌యాన్ని మూసివేయ‌నున్నారు. దాదాపు 8 గంట‌లు మూసివుంచ‌నున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత అక్టోబర్ 29న తెల్లవారుజామున 3.15 గంటలకు ఏకాంతంలో సంప్రదాయ శుద్ధి, సుప్రభాత సేవ అనంతరం ఆలయ తలుపులు తెరుస్తారు. గ్రహణాల సమయంలో ఆలయాన్ని మూసివేయడం ద్వారా ఆలయ పవిత్రతను పరిరక్షించే దీర్ఘకాలిక ఆచారానికి కొనసాగింపుగా ఈ షెడ్యూల్ షట్ డౌన్  ఉంటుంద‌ని టీటీడీ వ‌ర్గాలు తెలిపాయి. 
 

lunar eclipse : Tirumala Tirupati Devasthanam temple to remain closed for 8 hours RMA
Author
First Published Oct 27, 2023, 4:53 PM IST

Tirumala Tirupati Devasthanam (TTD): పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం నేప‌థ్యంలో తిరుమల శ్రీవారి ఆల‌యాన్ని మూసివేయ‌నున్నారు. దాదాపు 8 గంట‌లు మూసివుంచ‌నున్నారు. ఈ నెల 28, 29 తేదీల మధ్యరాత్రి ఏర్పడే పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కొద్దిసేపు మూసివేయనున్నారు. మ‌ళ్లీ అక్టోబర్ 29న తిరిగి తెరవనున్నారు. అక్టోబర్ 29న తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల వరకు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణం సమయం క్ర‌మంలో ఈ నెల 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది.

గ్రహణం ముగిసిన తర్వాత అక్టోబర్ 29న తెల్లవారుజామున 3.15 గంటలకు ఏకాంతంలో సంప్రదాయ శుద్ధి, సుప్రభాత సేవ అనంతరం ఆలయ తలుపులు తెరుస్తారు. గ్రహణాల సమయంలో ఆలయాన్ని మూసివేయడం ద్వారా ఆలయ పవిత్రతను పరిరక్షించే దీర్ఘకాలిక ఆచారానికి కొనసాగింపుగా ఈ షెడ్యూల్ షట్ డౌన్  ఉంటుంద‌ని టీటీడీ వ‌ర్గాలు తెలిపాయి. ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయడంతో సహస్ర దీపాలంకార సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం రద్దు చేశారు. ఈ నెల 28న సాయంత్రం 6 గంటలకు తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో అన్నప్రసాదాల పంపిణీ నిలిపివేయనున్నారు. భక్తులు ఈ షెడ్యూల్ మార్పులపై దృష్టి సారించాలనీ, ఈ సమయంలో వారి సౌకర్యానికి హామీ ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు.

విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ ఆల‌యంలో.. 

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఈ నెల 28వ తేదీ శనివారం సాయంత్రం 6.30 గంటలకు పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నారు. అక్టోబర్ 29 ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి అనుమతించే ముందు స్నపనాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయంలోని ఉపాలయాలను కూడా మూసివేయనున్నారు.

సింహాచలం ఆల‌యంలోకి ప్ర‌వేశించిన కుక్క 

విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలోకి కుక్క చొరబడింది. ఇది ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా ఉండటంతో అధికారులు రెండు గంటల పాటు దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అర్చకులు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించే వరకు భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాతే ఆలయాన్ని భక్తుల కోసం తెరిచారు. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వీధికుక్క ఆలయంలోకి ప్రవేశించిందని భక్తులు ఆరోపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios