Asianet News TeluguAsianet News Telugu

నిజం గెలవాలి బస్సు యాత్ర ప్రారంభం: చంద్రగిరిలో ప్రవీణ్ రెడ్డి కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ( వీడియో)


నిజం గెలవాలి బస్సు యాత్రను  నారా భువనేశ్వరి ఇవాళ ప్రారంభించారు.  చంద్రబాబు అరెస్టుతో  మరణించిన  టీడీపీ కార్యకర్తల కుటుంబాలను  భువనేశ్వరి పరామర్శిస్తున్నారు.

 Nara Bhuvaneshwari Begins  Nijam Gelavali  Bus yatra in Chandragiri lns
Author
First Published Oct 25, 2023, 12:15 PM IST | Last Updated Oct 25, 2023, 12:21 PM IST

తిరుపతి:చంద్రబాబు అరెస్టుపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది  నారా భువనేశ్వరి.  నిజం గెలవాలి కార్యక్రమానికి  బుధవారంనాడు నారా భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  నిజం గెలవాలి బస్సు యాత్రకు నారా భువనేశ్వరి  ప్రారంభించారు.  ఈ బస్సు యాత్ర ప్రారంభానికి ముందు  నారావారిపల్లెలో  ఎన్టీఆర్ విగ్రహానికి  భువనేశ్వరి పూలమాల వేసి నివాళులర్పించారు.

చంద్రగిరిలోని ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని  నారా భువనేశ్వరి  పరామర్శించారు. చంద్రబాబు అరెస్టుతో  ప్రవీణ్ రెడ్డి  గుండెపోటుతో మరణించినట్టుగా టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. దీంతో  ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను  భువనేశ్వరి ఇవాళ పరామర్శించారు.  ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.  ప్రవీణ్ రెడ్డి కుటుంబానికి  రూ. 3 లక్షల  చెక్ ను  నారా భువనేశ్వరి అందించారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును  ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది.ఈ కేసులో చంద్రబాబు ప్రస్తుతం జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ కారణంగా మృతి చెందిన కుటుంబాలను  పరామర్శించడంతో పాటు అరెస్ట్ పై వాస్తవాలను  ప్రజలకు వివరించాలని భువనేశ్వరి భావించారు. నిజం గెలవాలనే పేరుతో  భువనేశ్వరి బస్సు యాత్రను ప్రారంభించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios