TDP: 'నిజం గెలవాలి' బస్సు యాత్రకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
Tirumala: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ యాత్రతో ప్రజల్లోకి వెళ్లడంతో పాటు చంద్రబాబు అరెస్ట్ తో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.
Nara Bhuvaneshwari: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ యాత్రతో ప్రజల్లోకి వెళ్లడంతో పాటు చంద్రబాబు అరెస్ట్ తో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈరోజు (మంగళవారం) తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు ఈ నెల 25 నుంచి భువనేశ్వరి “నిజం గెలవాలి” పేరుతో బస్సుయాత్ర చేపట్టనున్నారు.
"నిజం గెలవాలి" యాత్రలో భువనేశ్వరి వారానికి మూడు రోజులు ఇంటింటికీ వెళ్తుంది. 25న చంద్రగిరి నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. బుధవారం ఐతేపల్లి మండలం ఎస్సీ కాలనీలో భువనేశ్వరి గ్రామస్తులతో కలిసి భోజనం చేస్తారు. అనంతరం అగరాల బహిరంగ సభలో అక్రమ అరెస్టుపై ఆమె ప్రసంగించనున్నారు. అనంతరం భువనేశ్వరి అగరాలలో మహిళలతో సమావేశం కానున్నారు. గురువారం నారా భువనేశ్వరి తిరుపతికి వెళ్లి ఆటోడ్రైవర్లతో సమావేశం, అనంతరం అక్టోబర్ 27న శ్రీకాళహస్తిలో మహిళలతో సమావేశం కానున్నారు.