Asianet News TeluguAsianet News Telugu

బాధితురాలి పొంతనలేని సమాధానాలు.. అంతా కట్టుకథేనా : జహీరాబాద్ అత్యాచార ఘటనలో ట్విస్ట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జహీరాబాద్ అత్యాచార కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలు కట్టుకథ అల్లి బురిడి కొట్టించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. 

twist in zaheerabad gang rape case
Author
First Published Sep 27, 2022, 3:41 PM IST

జహీరాబాద్‌లో యువతి అత్యాచారం కేసు మలుపులు తిరుగుతోంది. గ్యాంగ్ రేప్ అన్నది బూటకమని అనుమానిస్తున్నారు పోలీసులు. బాధితురాలు కట్టుకథ అల్లినట్లుగా భావిస్తున్నారు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానించిన పోలీసులు హైదరాబాద్‌లో సీసీ కెమెరాలు పరిశీలించారు. కూకట్‌పల్లి, తిరుమలగిరి, బోయిన్‌పల్లిలో సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు జహీరాబాద్ పోలీసులు. ఈ నెల 22న మద్యం మత్తులో వున్న బాధితురాలిని స్థానికులు పోలీసులకు అప్పగించినట్లుగా గుర్తించారు. బాలానగర్ మహిళా పోలీసులు ఆమెకు రోజంతా కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా తేలింది. ఈనెల 23న జహీరాబాద్‌కు ఎలా వచ్చింది అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి తప్పుడు సమాచారం ఇస్తూ వుండటంతో ఏ కోణంలో దర్యాప్తు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ALso REad:జహీరాబాద్​లో వివాహితపై సామూహిక అత్యాచారం..!

కాగా.. 24 ఏళ్ల వివాహితపై జహీరాబాద్ సమీపంలో కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు మత్తు మందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే అనుమానస్పద స్థితిలో మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మహిళను సఖీ కేంద్రానికి తరలించారు. వివాహితను ఆటోలో జహీరాబాద్‌కు తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. అయితే కొన్నాళ్లుగా ఆమె భర్తతో దూరంగా ఉంటుందని సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios