స్టేషన్ ఘన్ పూర్: తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ నియోకజకవర్గంలో సమ్మతి లేదు అసమ్మతి లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆదేశాలతో అభ్యర్థి రాజయ్యతో కలిసి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పర్యటించారు. 

రాజయ్య తన తమ్ముడు అని తనకు నియోజకవర్గంలో ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. తాను అలిగి నియోజకవర్గంలో పర్యటించడం లేదని ప్రచారం జరుగుతుందని అది వాస్తవం కాదన్నారు. 

రాజయ్య అప్పుడప్పుడూ తనపట్ల తప్పుడుగా ప్రవర్తించినా తాను ఏనాడూ అలా ప్రవర్తించలేదన్నారు.రాజయ్య తన సోదరుడు అని టీఆర్ఎస్ పార్టీలో అతనికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత అని కొనియాడారు. పార్టీ కార్యకర్తలు, నియోకవర్గ ప్రజలు సమన్వయంతో పనిచేసి రాజయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

తాను స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, కడియం శ్రీహరిల మధ్య గత కొంతకాలంగా వర్గపోరు నడుస్తోంది. ఇటీవల కాలంలో రాజయ్య సీటుకు ఎసరుపెట్టేందుకు కడియం శ్రీహరి తన కుమార్తెను తెరపైకి తెచ్చారన్న ప్రచారం కూడా జరిగింది. 

ఈ వార్తలు కూడా చదవండి

రాజయ్యకు కడియం వార్నింగ్:పద్దతి మార్చుకో 

కనిపించకుండా పోయిన.. రాజయ్య ‘‘కొంటెపులి..చిలిపి పిల్ల’’..?

"కొంటెపులివి, చిలిపి పిల్లవి"... ఫోన్లో రాజయ్య రాసలీలలు.. మహిళతో అసభ్య సంభాషణ

కడియంకు రాజయ్య పాదాభివందనం.. ఎన్నికల్లో సహకరించాలని విన్నపం

రాజయ్యకి షాక్.. పెల్లుబుక్కుతున్న అసమ్మతి

మళ్లీ బోరున ఏడ్చేసిన రాజయ్య