టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య.. మరోసారి బోరున ఏడ్చేశారు.ఎన్నికల ప్రచారం సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాటికొండ రాజయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనను గెలిపించాలంటూ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పట్టుకొని భోరుమన్నారు. 

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మాసాగర్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రాజయ్యకు మద్దతుగా పల్లా అక్కడ ప్రచారం నిర్వహించారు. కంటతడి పెట్టుకున్న రాజయ్యను పల్లా ఓదార్చే ప్రయత్నం చేశారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో పల్లా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన తొలి జాబితాలోని అభ్యర్థులను మార్చే ప్రసక్తి లేదని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే తాను ప్రచారానికి వచ్చానని, డిప్యూటీ సీఎం కడియం ఆశీస్సులు కూడా రాజయ్యకు ఉంటాయని ఆయన అన్నారు.
 

read more news

సభలో అందరి ముందు ఏడ్చేసిన రాజయ్య

కడియంకు రాజయ్య పాదాభివందనం.. ఎన్నికల్లో సహకరించాలని విన్నపం

"కొంటెపులివి, చిలిపి పిల్లవి"... ఫోన్లో రాజయ్య రాసలీలలు.. మహిళతో అసభ్య సంభాషణ