తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం టీ. రాజయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో టేప్  ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు  కొడుతుండటం సంచలనం కలిగించింది. అసలే అసమ్మతి సెగలతో తట్టుకోలేకపోతున్న రాజయ్యకు తాజా వివాదం రాజకీయంగా దెబ్బే అంటున్నారు విశ్లేషకులు.. దీనిపై అసమ్మతి వాదులతో పాటు నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. అసలు రాజయ్య ఏం మాట్లాడంటే..

మహిళ: హలో..
రాజయ్య: హూ... చెప్పండి...
మహిళ:నేను నానిని సార్‌...
రాజయ్య: నాకు తెల్సుర నాని.. నువ్వు ఎప్పడు ఎలాగుంటావో నాకు చాలా తెల్సురా... ఎందుకంటే నువ్వు ఎంతో కొంటె పులివి..
మహిళ: నవ్వుతూ... ఎందుకు.. కొంటెతనమంటే ఏంటిది..?
రాజయ్య: అంటే చిలిపి చేష్టలు అన్నట్టు.. తిడుతలేను నేను, రేపు పొద్దున్నే 8గంటల వరకు నీదగ్గర ఉంటా.
మహిళ: మొన్న నువ్వు వస్తవనుకున్నా.. ఫోన్‌చేస్తే స్విచ్ఛాఫ్‌ చేసుకుంటావ్‌.. నువ్వు అడగ్గానే బాధపెట్టవద్దని అనుకున్న..
రాజయ్య: నువ్వే.. నేనేంచేసినా కావాలని చేస్తున్నావ్‌... (నవ్వులు).., నువ్వు వద్దంటే ఊకుంటా..
మహిళ: నాకు పోస్టు ఎప్పుడిస్తవ్‌, ఎప్పుడు చేతులపెడ్తవ్‌..
రాజయ్య: ఇప్పుడు దయాకర్‌ ఇస్తడు.. వెంకటేశ్వర్లు ఉన్నారు. వాళ్లే కదా నీకు కావాల్సినోళ్లు..
మహిళ: హీరో... హీరో ఉన్నాక వాళ్లెవరు.. ఫస్ట్‌హీరో నువ్వే...
రాజయ్య: అదేచెబుతున్న ఫస్ట్‌హీరోను నేను.. సెకండ్‌ వెంకటేశ్వర్లు, థర్డ్‌ దయాకర్‌... అంతా నీ రాజ్యం..
రాజయ్య: ఎన్నిసార్లు దయకర్‌దగ్గరికి పోయినవ్‌ చెప్పు...
మహిళ: అబద్ధం... ఒట్టుసార్‌ ప్రామిస్‌.. అమ్మతోడు..
రాజయ్య: మొత్తం ఎన్నిసార్లు పొయినవంటే...
మహిళ: పోవడమెక్కడిది.. పండటమెక్కడిది...
రాజయ్య: నువ్వు తక్కువదానివి కాదు..
మహిళ: ఆయన బిజీబిజీగా ఉన్నారు. ఆయనకు లవర్‌ ఉన్నదట అదికూడా చెప్పిండు, మాటల సందర్భంగా చెప్పిండు.
రాజయ్య: అదెక్కడుందట..
మహిళ: సొంత మరదలట.. ఆడమంటే ఆడతదట, పాడమంటే పాడుతదట..
రాజయ్య: సొంత భార్య చెల్లెలే.. మీ ఆయనెవరో చెప్పరాదు..? ఎక్కడుంటడు..?
మహిళ: నువ్వే మా ఆయన...

మహిళల పట్ల రాజయ్య వ్యవహరిస్తున్న తీరుపై స్టేషన్‌ ఘన్‌పూర్ ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఇలాంటి నాయకుల వల్ల పార్టీ పరువు పొతోందని... టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో చులకనభావం ఏర్పడుతుందన్నారు.

రాజయ్య టికెట్‌ను రద్దు చేసి మరో నాయకుడికి టికెట్ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయతే స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలంటూ రాజారావు ప్రతాప్ తదితరులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనను అప్రతిష్టపాలు చేయడానికే ఈ వీడియోను బయటకు తెచ్చారని.. సదరు మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు.