స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య బుధవారం అపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిశారు. తన విజయానికి సహకరించాలని అభ్యర్థించారు. రాజయ్యకు టికెట్ ఇవ్వడంపై స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన టీఆర్ఎస్ నేతలు పార్టీ అధిష్టానంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

ముఖ్యంగా రాజారపు ప్రతాప్ వర్గం రాజయ్య టికెట్‌ను రద్దు చేయించి.. తనకు ఇప్పించాలని కోరుతోంది. సరిగ్గా ఈ క్రమంలో ఓ మహిళతో రాజయ్య అసభ్యంగా మాట్లాడిన ఆడియో టేప్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో రాజయ్యపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుని ప్రతాప్ వర్గం చాకచక్యంగా పావులు కదుపుతోంది.

‘‘రాసలీలల రాజయ్య’’ అభ్యర్థిగా పనికిరాడని అతని టికెట్‌ను రద్దు చేయాలంటూ కోరుతోంది. ఈ పరిణామాల క్రమంలో రాజయ్య.. కడియం శ్రీహరిని కలిసి  పాదాభివందనం చేశారు. ‘‘విమర్శలను పట్టించుకోకుండా నియోజకవర్గంలో నీ పని నువ్వు చూసుకో అంటూ’’ ఈ సందర్భంగా కడియం చెప్పినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కూడా రాజయ్య కలిశారు. 

"కొంటెపులివి, చిలిపి పిల్లవి"... ఫోన్లో రాజయ్య రాసలీలలు.. మహిళతో అసభ్య సంభాషణ