మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే టీ. రాజయ్య స్వరాన్ని పోలిన వ్యక్తి.. ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో టేపు సంచనల కలిగించిన సంగతి తెలిసిందే. అయితే సదరు మహిళ ఆరోజు నుంచి కనిపించకుండా పోయినట్లు ఘన్‌పూర్‌లో జనం చర్చించుకుంటున్నారు.

భర్తతో విభేదాల కారణంగా ఓ మహిళ విడిగా ఉంటోంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కళ్యాణ లక్ష్మీ పథకం కింద సహకారం కోరవచ్చిన ఎవరో చెప్పిన మాట విని దిగువ శ్రేణి నాయకుల ద్వారా పెద్ద నాయకుడికి పరిచయం అయ్యింది.

అలా వారి మధ్య గత కొంతకాలంగా ఫోన్ సంభాషణ జరుగుతోంది. వీటిలో ఒక ఆడియో టేపు బయటకు వచ్చింది  ఆ ఫోన్ సంభాషణ మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యదిగా మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుండటంతో.. సదరు మహిళను స్థానిక టీఆర్ఎస్ నేతలే ఎక్కడికో తీసుకుపోయి వుంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేకపోతే ఫోన్‌లో వినిపించిన గొంతు రాజయ్యది కాదు అని బలవంతంగా చెప్పించడానికి ఆమెను తీసుకువెళ్లారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

"కొంటెపులివి, చిలిపి పిల్లవి"... ఫోన్లో రాజయ్య రాసలీలలు.. మహిళతో అసభ్య సంభాషణ

కడియంకు రాజయ్య పాదాభివందనం.. ఎన్నికల్లో సహకరించాలని విన్నపం

రాజయ్యకి షాక్.. పెల్లుబుక్కుతున్న అసమ్మతి

మళ్లీ బోరున ఏడ్చేసిన రాజయ్య