మాజీ మంత్రి రాజయ్యకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆయనకు సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. వరంగల్ లో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.  స్టేషన్ ఘణపూర్ టికెట్ రాజయ్యకి కాకుండా కడియం శ్రీహరి కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్.. తమ పార్టీ తరపు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో రాజయ్య పేరు కూడా ఉంది. అయితే.. రాజయ్య ఇతర మహిళలతో స్త్రీలో రాసలీలలు ఆడాడని.. ఇటీవల ఆడియో టేపులు విడుదలయ్యాయి. దీంతో.. ఆయనకు టికెట్ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి.

దీనిపై కేసీఆర్ స్పందించకపోవడంతో టీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. ఈ రోజు కొందర పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రాజయ్యకు టికెట్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. రాజయ్యకు ఇచ్చిన టికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
 

read more news

కడియంకు రాజయ్య పాదాభివందనం.. ఎన్నికల్లో సహకరించాలని విన్నపం

"కొంటెపులివి, చిలిపి పిల్లవి"... ఫోన్లో రాజయ్య రాసలీలలు.. మహిళతో అసభ్య సంభాషణ