Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్ లో కేంద్రం వైఖరిపై టిఆర్ఎస్ అసంతృప్తి గళం వినిపించాలని నిర్ణయం

తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును పార్లమమెంట్ సమావేశాల ద్వారా ఎండగట్టాలని టిఆర్ఎస్ పార్టీ నిర్ణయం  తీసుకుంది.  ఈ మేరకు ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. 

TRS plan for parliament budget session
Author
Hyderabad, First Published Jan 28, 2020, 11:11 PM IST

హైదరాాబాద్: తెలంగాణ సమస్యలపై పార్లమెంటులో గళం విప్పాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ను చిన్నచూపు చూస్టిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ భవన్లో కేటిఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పార్లమెంట్ బడ్జెట్ లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలు చర్చించారు.

 కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టాలని టిఆర్ ఎస్ నిర్ణయం తీసుకుంది.  రాష్ట్ర విభజన అనంతరం విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని టిఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆరేళ్లుగా ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని ఇదే అంశాన్ని పార్లమెంట్ లో మరోసారి లెవనెత్తుతామని ఎంపీ లు అన్నారు.

 కేంద్రం ఇటీవల తెచ్చిన సీఏఏను వ్యతిరేకించాలని,ఎఎన్సీఆర్,  ఎన్ పి ఆర్ లపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది.

read more  రెబెల్స్ విషయంలో అంతుచిక్కని టీఆర్ఎస్ వ్యూహం

 రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని టిఆర్ ఎస్ తప్పుపడుటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం  సహకరించడం లేదనే వాదనలు తెరపైకి తెస్తోంది.

 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీవ్రంగా పెంచాలన్న యోచనలో టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నారు.ఎన్ సి ఆర్, ఎన్ పి ఆర్ ను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో పార్లమెంట్లో అదే గళం వినిపించాలని టిఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది
 

Follow Us:
Download App:
  • android
  • ios