నిజామాబాద్:కాంగ్రెస్ పార్టీని వీడి తాను తప్పు చేశాననని మాజీ మంత్రి డి. శ్రీనివాస్ చెప్పారు

సోమవారం నాడు  టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు  డి.శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.మంత్రి  ప్రశాంత్‌ రెడ్డి పిచ్చిపట్టనట్టుగా మాట్లాడుతున్నారని  డి. శ్రీనివాస్‌  చెప్పారు.దమ్ముంటే  తనపై  చర్యలు తీసుకోవాలని డి.శ్రీనివాస్  డిమాండ్ చేశారు. ఎందుకు తనపై చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని  డి.శ్రీనివాస్  కోరారు.

దిగ్విజయ్ సింగ్ తనపై సోనియాకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే మనస్థాపంతో పార్టీని వీడానని డి.శ్రీనివాస్ చెప్పారు.తండ్రీ, కొడుకు, కూతురు బాగుపడితే బంగారు తెలంగాణ అయినట్టేనా అని డి.శ్రీనివాస్ ప్రశ్నించారు.  తనపై మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన విమర్శలను ఖండిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

తాను చేసింది తప్పు అని నిరూపించే ధైర్యం ఉంటే సస్పెండ్ చేయాలని  డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు. కొంతమంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేకపోయినా తనను సస్పెన్షన్ చేయాలని కోరుతూ పెట్టిన  తీర్మానంపై సంతకాలు చేశారని డి.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.


2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్  ఎంపీ డి.శ్రీనివాస్‌పై నిజామాబాద్ జిల్లాకు చెందిన  టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై  కేసీఆర్ కు వివరణ ఇచ్చేందుకు  డి.శ్రీనివాస్ ప్రయత్నాలు చేశారు.  కానీ, కేసీఆర్ మాత్రం  ఆ అవకాశం ఇవ్వలేదు. అప్పటి నుండి టీఆర్ఎస్ కార్యక్రమాలకు డి.శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు.

అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో డి.శ్రీనివాస్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.గత ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  డి.శ్రీనివాస్ తనయుడు అరవింద్ నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. అరవింద్ నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి విజయం సాధించడం వెనుక డి.శ్రీనివాస్  కీలకపాత్ర పోషించినట్టుగా   ఆ జిల్లాలో ప్రచారంలో ఉంది.

సంబంధిత వార్తలు

డిఎస్ వ్యూహాత్మక అడుగులు: ఆ పదవిపై గురి...

కాంగ్రెస్‌లో డీఎస్ చేరిక: ముహూర్తమిదీ..

నందీశ్వర్‌గౌడ్, కేఎస్ రత్నంలకు కాంగ్రెస్ సీనియర్ల షాక్

భూపతిరెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్

ముహూర్తం ఖరారు: కాంగ్రెస్‌లోకి డీఎస్, కొండా సురేఖ

ఉప్పల్ కాంగ్రెస్‌లో చిచ్చు: అనుచరులతో రాజిరెడ్డి భేటీ, టీఆర్‌ఎస్‌లోకి

రాజకీయాల నుండి తప్పుకొంటా: ఎర్రబల్లి దయాకర్ రావు సంచలనం

సబితాను కలిసిన తర్వాతే కాంగ్రెస్‌లో చేరుతా: కేఎస్ రత్నం

టీఆర్ఎస్‌కు షాక్: ఉత్తమ్‌తో కేఎస్ రత్నం మంతనాలు, త్వరలోనే కాంగ్రెస్‌లోకి