Asianet News TeluguAsianet News Telugu

నందీశ్వర్‌గౌడ్, కేఎస్ రత్నంలకు కాంగ్రెస్ సీనియర్ల షాక్

మెదక్, రంగారెడ్డి జిల్లాలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో  చేరేందుకు మాజీ ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలను ఆ జిల్లాలకు చెందిన  కాంగ్రెస్ సీనియర్లు అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. 
 

congress senior leaders shocks to nandishwar goud and ks ratnam
Author
Hyderabad, First Published Sep 10, 2018, 2:05 PM IST

హైదరాబాద్: మెదక్, రంగారెడ్డి జిల్లాలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో  చేరేందుకు మాజీ ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలను ఆ జిల్లాలకు చెందిన  కాంగ్రెస్ సీనియర్లు అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఉమ్మడి మెదక్ జిల్లా పటాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బీజేపీకి గుడ్‌బై చెప్పి  కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్లాన్ చేసుకొంటున్నారు.ఈ మేరకు  రెండు రోజుల క్రితం  నందీశ్వర్ గౌడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని  కలిశారు.

నందీశ్వర్ గౌడ్ మాజీ పీసీసీ చీఫ్, ప్రస్తుత టీఆర్ఎస్ ఎంపీ డీ.శ్రీనివాస్ అనుచరుడిగా పేరుంది. డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరిన తర్వాత నందీశ్వర్ గౌడ్  బీజేపీలో చేరాడు.  అయంతే నందీశ్వర్ గౌడ్ బీజేపీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు.

పటాన్ చెరువు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నందీశ్వర్ గౌడ్ పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  రెండు రోజుల క్రితం నందీశ్వర్ గౌడ్  ఉత్తమ్ కుమార్ రెడ్డితో  సమావేశమయ్యారని సమాచారం. అయితే నందీశ్వర్ గౌడ్  కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నిర్ణయం పట్ల మాజీ డిప్యూటీసీఎం దామోదర రాజనర్సింహా ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.

నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని దామోదర రాజనర్సింహా వ్యతిరేకిస్తున్నారని సమాచారం. నందీశ్వర్ గౌడ్ పార్టీలో చేరితే ఇప్పటివరకు పటాన్ చెరువులో పార్టీతో ఉన్న నాయకుల పరిస్థితి ఏమిటనే వాదన మొదలైంది. 

ఇదిలా ఉంటే  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని  చేవేళ్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం కూడ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో రత్నం సమావేశమయ్యారు. అయితే రత్నం కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆసక్తి చూపడంపై సబితా ఇంద్రారెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

సబితా ఇంద్రారెడ్డిని కలిసిన తర్వాతే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని కూడ కేఎస్ రత్నం చెబుతున్నారు. కానీ, రత్నం కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నిర్ణయంపై సబితా కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కాంగ్రెస్ లో  ఉంది.

ఈ తరుణంలో  వీరిద్దరి చేరికపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.మరోవైపు సీపీఐతో  పొత్తు ఉంటుందనే ప్రచారం సాగుతున్న తరుణంలో వైరా సీటును సీపీఐకు కేటాయించకూడదంటూ వైరాకు చెందిన  కాంగ్రెస్ నేతలు ఆదివారం నాడు గాంధీభవన్ ఎదుట ఆందోళన చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios