కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ  భూపతి రెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్‌లు శుక్రవారం నాడు  కాంగ్రెస్ పార్టీలో చేరారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్‌లు శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

టీఆర్ఎస్ ఎంపీ డీ.శ్రీనివాస్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న ఎమ్మెల్సీ భూపతి రెడ్డి శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో డి.శ్రీనివాస్ కూడ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని నిజామాబాద్ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేతలు కొందరు కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదు‌పై ఇంకా చర్యలు తీసుకోలేదు. డీఎస్ కూడ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలోనే డీఎస్ ప్రధాన అనుచరుడు భూపతిరెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి బండ్ల గణేష్‌ను, భూపతిరెడ్డిని రాహుల్ గాంధీ పార్టీలో ఆహ్వానించారు.