హైదరాబాద్:  తాను కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమైన మాట వాస్తవమేనని చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం చెప్పారు. అయితే తన వియ్యంకుడికి కాంగ్రెస్ టిక్కెట్టు గురించి మాట్లాడేందుకు తాను ఉత్తమ్ తో చర్చించినట్టు ఆయన చెప్పారు.

సోమవారం నాడు ఆయన ఉత్తమ్‌తో సమావేశం కావడంపై  మీడియాతో మాట్లాడారు. చేవేళ్ల టిక్కెట్టు విషయమై  తాను కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నానని ఆయన చెప్పారు.  ఈ నెల 12వ తేదీన  తాను తన అనుచరులతో సమావేశం కానున్నట్టు ఆయన చెప్పారు.

ఇంద్రారెడ్డి తన రాజకీయ గురువని ఆయన చెప్పారు. సబితా ఇంద్రారెడ్డి ఆశీస్సులను కూడ కోరుతానని ఆయన చెప్పారు. సబితా ఇంద్రారెడ్డిని కలవకుండా తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోనని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు కేసీఆర్ తో చెప్పిన తర్వాతే  చేరుతానని ఆయన చెప్పారు. ఈ నెల 12వ తేదీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు ఆయన తెలిపారు.

ఈ వార్త చదవండి

టీఆర్ఎస్‌కు షాక్: ఉత్తమ్‌తో కేఎస్ రత్నం మంతనాలు, త్వరలోనే కాంగ్రెస్‌లోకి