హైదరాబాద్: టిక్కెట్లు రాకపోవడంతో అసంతృప్తులు  ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. టీఆర్ఎస్‌ నుండి ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీలు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. సెప్టెంబర్ 12వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న ఎంపీ డీ.శ్రీనివాస్  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకొన్నారు. సెప్టెంబర్ 12 వ తేదీన  ఆజాద్  హైద్రాబాద్‌కు రానున్నారు. ఆజాద్ హైద్రాబాద్‌ పర్యటనలో  భాగంగా డి.శ్రీనివాస్ తన అనుచరులతో పాటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

డీఎస్ తో పాటు ఆయన ప్రధాన అనుచరుడిగా ముద్ర పడిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడ ఈ నెల 12 వ తేదీన  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మరో వైపు వరంగల్ ఈస్ట్ సీటు విషయంలో  టీఆర్ఎస్ సస్పెన్స్ కొనసాగిస్తోంది.

వరంగల్ ఈస్ట్ ‌కు సంబంధించి టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవడంతో  కొండా దంపతులు రెండు రోజుల క్రితం కేసీఆర్‌పై కేటీఆర్‌ పై విమర్శలు చేశారు. పరకాల, వరంగల్ ఈస్ట్ నియోజకర్గాలకు చెందిన  తమ అనుచరులతో  కొండా దంపతులు సమావేశమయ్యారు.

సెప్టెంబర్ 12వ తేదీన ఆజాద్  సమక్షంలో డీఎస్ తో పాటు కొండా దంపతులు మరో ఎమ్మెల్సీ  భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మరో వైపు  మాజీ ఎమ్మెల్యేలు ఆకుల రాజేందర్, కేఎస్ రత్నం, బాలూనాయక్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌, ఇబ్రహీంపట్నం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కూడ  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.

ఇదిలా ఉంటే బాలు నాయక్ కాంగ్రెస్ పార్టీ తరపున జడ్పీ ఛైర్మెన్ గా  కొనసాగారు. అయితే ఆ తర్వాత పరిణామాల్లో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. దేవరకొండ నుండి ఆయన 2009లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  కానీ, 2014 ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కలేదు. జడ్పీటీసీగా పోటీ చేసి జడ్పీ ఛైర్మెన్ గా ఎన్నికయ్యారు.

దేవరకొండ ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించాడు. కానీ, సీపీఐ నుండి  గత ఎన్నికల్లో దేవరకొండ నుండి పోటీ చేసిన రవీంద్రకుమార్ గత ఏడాది టీఆర్ఎస్ లో చేరడంతో  ఆయనకే టిక్కెట్టు దక్కింది. దీంతో బాలునాయక్  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు.

ఈ వార్తలు చదవండి

ఉప్పల్ కాంగ్రెస్‌లో చిచ్చు: అనుచరులతో రాజిరెడ్డి భేటీ, టీఆర్‌ఎస్‌లోకి

రాజకీయాల నుండి తప్పుకొంటా: ఎర్రబల్లి దయాకర్ రావు సంచలనం

సబితాను కలిసిన తర్వాతే కాంగ్రెస్‌లో చేరుతా: కేఎస్ రత్నం

టీఆర్ఎస్‌కు షాక్: ఉత్తమ్‌తో కేఎస్ రత్నం మంతనాలు, త్వరలోనే కాంగ్రెస్‌లోకి