డిఎస్ వ్యూహాత్మక అడుగులు: ఆ పదవిపై గురి
నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకొన్నాయి. డి. శ్రీనివాస్ ను తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ నాయకత్వం అడుగులు వేస్తోందని ప్రచారం సాగుతోంది.
110

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి డి.శ్రీనివాస్ ఎటువైపు అడుగులు వేస్తారనే విషయమై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. బీజేపీలో చేరేందుకు డి.శ్రీనివాస్ ఆసక్తిని కనబరుస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

210
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిఎస్‌పై నిజమాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు చేశారు.

310
ఈ ఆరోపణలకు సంబంధించి సీఎం కేసీఆర్ కు వివరణ ఇవ్వాలని డిఎస్ ప్రయత్నించినా ఆనాడు కేసీఆర్ ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఈ ఏడాది టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు.

410
ఈ సమావేశంలో పాల్గొన్న మరునాడే డిఎస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు. డి. శ్రీనివాస్ తనయుడు అరవింద్ ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

510
టీఆర్ఎస్ తనపై చర్యలు తీసుకోవాలని కూడ డి.శ్రీనివాస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాడు. కానీ, డి.ఎస్‌పై చర్యలకు టిఆర్ఎస్ మాత్రం అంతగా ఆసక్తిని చూపడం లేదు.

610
బీజేపీలో చేరగానే డి.శ్రీనివాస్ కు పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉంటాయా అనే చర్చ కూడ లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ తరుణంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం.

710
టీఆర్ఎస్ తనపై చర్యలు తీసుకోవాలని కూడ డి.శ్రీనివాస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాడు. కానీ, డి.ఎస్‌పై చర్యలకు టిఆర్ఎస్ మాత్రం అంతగా ఆసక్తిని చూపడం లేదు.
టీఆర్ఎస్ తనపై చర్యలు తీసుకోవాలని కూడ డి.శ్రీనివాస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాడు. కానీ, డి.ఎస్‌పై చర్యలకు టిఆర్ఎస్ మాత్రం అంతగా ఆసక్తిని చూపడం లేదు.
810
మరో వైపు బీజేపీలో చేరితే తన హోదాకు తగ్గ పదవిని ఇవ్వాలని డి.శ్రీనివాస్ బీజేపీ నాయకత్వం వద్ద ప్రతిపాదన పెట్టినట్టుగా సమాచారం. గవర్నర్ లేదా ఆ స్థాయిలో ఉన్న పదవిని తనకు కట్టబెట్టాలని కూడ డి. శ్రీనివాస్ బీజేపీ నాయకత్వం వద్ద ప్రతిపాదించినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

910
పార్టీని నమ్ముకొన్న వారికి పదవులు వస్తాయని బండారు దత్తాత్రేయ, సౌందర రాజన్ ఉదంతాలను బట్టి చూస్తే అర్ధమౌతోందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ తరుణంలో డి.శ్రీనివాస్ బీజేపీలో చేరుతారా.. చేరితే ఏ పదవిని ఆ పార్టీ నాయకత్వం కట్టబెట్టనుందనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

1010
బీజేపీ నాయకత్వం ఇటీవలనే పలువురికి గవర్నర్ పదవులను కట్టబెట్టింది. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ పదవిని ఇచ్చింది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ కు తెలగాణ రాష్ట్ర గవర్నర్ పదవిని కట్టబెట్టింది. బండారు దత్తాత్రేయతో ఇటీవల మాజీ మంత్రి డి.శ్రీనివాస్ భేటీ అయ్యారు.

Latest Videos