హైదరాబాద్: ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ  నియోజకవర్గ ఇంచార్జీ బండారు రాజిరెడ్డి సైనిక్ పురిలోని తన నివాసంలో అనుచరులతో సోమవారం నాడు  భేటీ అయ్యారు. రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ నెల 12 వ తేదీన  ఆయన టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మహాకూటమి  ఏర్పాటు కు కసరత్తు సాగుతోంది.ఈ కసరత్తులో భాగంగా టీడీపీ, కాంగ్రెస్ , సీపీఐ పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు చర్చలు ప్రారంభమయ్యాయి మరోవైపు ఇంకా ఇతర పార్టీలతో కూడ పొత్తుల విషయమై చర్చలు సాగనున్నాయి.ఈ తరుణంలో  ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ,మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడే యోచనలో ఉన్నట్టు సమాచారం.

2009 ఎన్నికల్లో ఉప్పల్ నుండి రాజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఈ దఫా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మహాకూటమి ఏర్పాటుకు విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి.

మహాకూటమి పొత్తులో భాగంగా  ఈ స్థానంలో టీడీపీ తరపున మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. దీంతో  కాంగ్రెస్ పార్టీలో ఉంటే తనకు టిక్కెట్టు దక్కదనే భావనతో రాజిరెడ్డి పార్టీని వీడాలని భావిస్తున్నట్టు సమాచారం.

అయితే ఈ విషయమై ఇంకా రాజిరెడ్డి తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అనుచరులతో మాత్రం ఆయన సమావేశమయ్యారు. మరో వైపు  ఈ నెల 12న, టీఆర్ఎస్ లో చేరేందుకు కూడ రంగం సిద్దం చేసుకొన్నారని రాజిరెడ్డిపై ప్రచారం సాగుతోంది. 

ఈ వార్తలు చదవండి

ముహూర్తం ఖరారు: కాంగ్రెస్‌లోకి డీఎస్, కొండా సురేఖ

రాజకీయాల నుండి తప్పుకొంటా: ఎర్రబల్లి దయాకర్ రావు సంచలనం

సబితాను కలిసిన తర్వాతే కాంగ్రెస్‌లో చేరుతా: కేఎస్ రత్నం

టీఆర్ఎస్‌కు షాక్: ఉత్తమ్‌తో కేఎస్ రత్నం మంతనాలు, త్వరలోనే కాంగ్రెస్‌లోకి