పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం సిరిపురం గ్రామంలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బడికి పోవాలంటే బాటలేదు. బడిలో కుసోని చదువుకుందామంటే చోటులేదు. దీంతో వర్షం వస్తే ఆ బడిలో చదువు ఇక ఆగమేనంటున్నారు.

బురద బాటలో నడిచిపోతే తీరా అక్కడ ఎండలోనే పాఠాలు నేర్చుకోవాల్సివస్తుంది. ఈ ఊరి పాఠశాలకు పక్కా భవనం సాంక్షన్ అయింది కానీ కట్టిస్తలేరు. వెంటనే బడి భవనం కట్టించాలని స్థానిక ఎన్ఎస్ యుఐ నాయకులు కోరుతున్నరు.