Asianet News TeluguAsianet News Telugu

మానవత్వాన్ని చాటుకుంటున్న తెలంగాణ కానిస్టేబుల్: రోజుకు 800 మందికి భోజనం

తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కానిస్టేబుల్ అరుణ్ కుమార్ ఈ కరోనా వేళ పేద ప్రజల కడుపునింపడానికి తన నెల జీతాన్ని ఇచ్చేస్తున్నాడు. సిటీ ఆర్మ్డ్ రిజర్వు పేట్లబుర్జ్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అరుణ్ కుమార్ రోజు 800 మంది కడుపునింపుతున్నాడు. 
Telangana Constable feeding 800 a day amidst this Lockdown
Author
Hyderabad, First Published Apr 16, 2020, 3:16 PM IST
కరోనా వేళా ఎందరో ప్రజలు తమ ఇండ్లకు దూరంగా చిక్కుబడిపోయి తిండికోసం అలమటిస్తున్నారు. మరికొందరు పని లేక తినడానికి తిండి దొరక్క అల్లాడిపోతున్నారు. 

ప్రభుత్వం వీలైనంత మేర అందరిని ఆదుకోవాలని చూస్తున్నప్పటికీ అది సాధ్యపడడం లేదు. ఇలా బయట మిగిలిపోయిన వారందరికీ దయార్ద్ర హృదయం ఉన్న ప్రాజాలు ఎందరో ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు. వీరంతా ఏ అంబానీలో అదానిలో కూడా కాదు. 

ఉన్న సమాజంలో మన వంతుగా సహాయం చేయాలి, దేశం నీకు ఏమిచ్చింది అనేకన్నా, నువ్వు దేశానికి ఏమిచ్చావు అనే గురజాడ పలుకులను పుణికి పుచ్చుకున్న వారు. వీరంతా ఈ ఆపద సమయంలో ముందుకు వస్తున్నారు. 

తాజాగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కానిస్టేబుల్ అరుణ్ కుమార్ ఈ కరోనా వేళ పేద ప్రజల కడుపునింపడానికి తన నెల జీతాన్ని ఇచ్చేస్తున్నాడు. సిటీ ఆర్మ్డ్ రిజర్వు పేట్లబుర్జ్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అరుణ్ కుమార్ రోజు 800 మంది కడుపునింపుతున్నాడు. 

ఉదయం అల్పాహారం సిఏఆర్ కాంటీన్ లో వందిస్తున్నట్టు, రాత్రి భోజనం ఇంట్లో తన భార్య, తల్లి, కలిసి వండుతున్నారని అన్నాడు. ఇలా రోజుకు 800 మందికి కడుపునింపడానికి డబ్బులు సరిపోవు కదా ఎలా అంటే... దేవుడు చూసుకుంటాడు అని నవ్వుతు సమాధానమిస్తున్నారు. 

 తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య 681కి చేరింది. వీరిలో 118 మంది కోలుకోగా..18 మంది మరణించారు. మిగిలిన వారు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

కాగా కేంద్ర ప్రభుత్వం కన్నా ముందే సీఎం కేసీఆర్.. లాక్ డౌన్ పొడిగించారు. అయితే.. ఈ పొడిగించిన లాక్ డౌన్ ను మరింత బలంగా అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చారు.

కేసులు ఎక్కువగా ఉన్న 139 ప్రాంతాల్లో కంటైన్మెంట్ క్లస్టర్లను రెడీ చేసింది. ఈ ప్రాంతాల్ని పూర్తిగా కంట్రోల్‌లో ఉంచబోతోంది. కంటైన్మెంట్ జోన్లకు సర్కిల్, జోనల్ స్థాయిలో నోడల్ బృందాలు ఏర్పాటవుతున్నాయి. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

ఆ ప్రకటనలో...రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో దారుల్ని 8 అడుగుల ఎత్తుండే బారికేడ్లతో మూయాలి. ఈ జోన్లలోకి వెళ్లి, వచ్చేందుకు ఒకటే రూట్ ఉండాలి. జోన్లను 24 గంటలూ పోలీసులు పర్యవేక్షించాలి. జోన్లలో వాళ్లు బయటకు రాకూడదు. బయటి వాళ్లు లోపలికి వెళ్లకూడదు. పోలీసుల్లో ఏఎస్సై లేదా ఎస్సై లేదా సీఐ స్థాయి ఆఫీసర్ పర్యవేక్షించాలి.

జోన్లలో ఉండేవారికి నిత్యవసరాలు అందించేందుకు ఓ నోడల్ ఆఫీసర్, శానిటైజేషన్ కార్యక్రమాలకు మరో ఆఫీసర్ ఉండాలి. అలాగే ఓ బిల్ కలెక్టర్ ఉంటారు. వీళ్లు ఇంటింటికీ వెళ్లి.. నిత్యవసరాలు ఇస్తారు. మాస్కులు కూడా ఇస్తారు.

కాగా.. ఈ కంటైన్మెంట్ జోన్లలో రోజూ శానిటేషన్ (శుభ్రత-పరిశుభ్రత) ఉంటుంది. రోజుకు రెండుసార్లు… సూక్ష్మక్రిములను చంపే రసాయానాల్ని పిచికారీ చేస్తారు. ఈ పని అధికారులు మాత్రమే చేస్తారు.

ప్రజలు చెయ్యకూడదు.కరోనా ఉందా లేదా అన్నది తెలుసుకునేందుకు రోజూ ఫీవర్ సర్వే ఉంటుంది. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే… ఆస్పత్రికి తీసుకెళ్తారు. పాజిటివ్ అని తేలితే… వారిని ఐసోలేషన్‌కి తరలించి… వారి కుటుంబ సభ్యుల్ని, చుట్టుపక్క వారిని క్వారంటైన్‌కి తరలిస్తారు. వారి చేతిపై క్వారంటైన్ ప్రింట్ వేస్తారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios