నల్గొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతులను మోసం చేసి కేసీఆర్ ఎన్నికల్లో గెలిచారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు రైతుల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. 

ప్రాజెక్టుల పేరుతో మూడు లక్షల కోట్లు అప్పు చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. యురేనియం తవ్వకాలను అడ్డుకునేందుకు అవసరమైతే ప్రాణాలను సైతం అర్పిస్తామని ఎంపీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు. 

టీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టిందని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. గులాబీ బాస్  కేసీఆర్ తీరును ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి పార్టీ సీనియర్ నేత నాయిని నర్సింహరెడ్డిలాంటి వారినే మోసం చేశాడంటే ప్రజల పరిస్థితి ఏంటో అర్థమవుతుందని విమర్శించారు.  

కేసీఆర్ పై ఆ పార్టీ నేతలకే నమ్మకం సన్నగిల్లుతోందని విమర్శించారు. అందుకే పార్టీలోో రోజు రోజుకి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఆరోపించారు. అధినేత తీరును వ్యతిరేకిస్తున్నవారిని తెలంగాణ భవన్‌కు పిలిచి కాళ్లు పట్టుకుని పార్టీలో ఉంచుతున్నారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

పార్టీకి ఓనర్లు ఉండరు, నేనే ఓనర్ అంటే ఎలా : కేటీఆర్ వార్నింగ్

ముల్లును ముల్లుతోనే..: కేసీఆర్ పై బిజెపి ప్రత్యేక వ్యూహం ఇదే...

కేసీఆర్ కు గులాబీ ఓనర్ల చిక్కు: హరీష్ రావుతో ఈటల రాజేందర్ కు చెక్

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ