తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన యాంకర్ శ్రీరెడ్డి ఉస్మానియా యూనివర్శిటీలో హల్ చల్ చేశారు. ఆమె ఓయు ఆర్ట్స్ కాలేజీ ముందుకు వచ్చారు. అక్కడ జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మహాత్మా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉస్మానియా విద్యార్థులు ఆమెకు మద్దతు పలికారు. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అక్రమాలను ఖండిస్తూ ఓయు స్టూడెంట్స్ నిరసన నినాదాలు చేశారు.

అనంతరం ఆమె ఉస్మానియా స్టూడెంట్స్ తో పలు అంశాలపై చర్చించారు. సినీ యాంకర్ ఉస్మానియాకు రావడంతో హాట్ టాపిక్ అయింది. శ్రీరెడ్డి ఉస్మానియాలో పర్యటించిన వీడియో పైన ఉంది చూడండి.