Asianet News TeluguAsianet News Telugu

మహిళా ఓటర్లకు గాలం: ఉత్తమ్ వరాల జల్లు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే  డ్వాక్రా సంఘాలకు లక్ష రూపాయాలను గ్రాంట్‌గా ఇస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

six gas cylinders for free  to bpl families says telanga pcc chief
Author
Hyderabad, First Published Oct 8, 2018, 2:44 PM IST


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే  డ్వాక్రా సంఘాలకు లక్ష రూపాయాలను గ్రాంట్‌గా ఇస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి  ఏడాదికి  ఆరు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా సంఘాల సభ్యులతో పాటు, ప్రతి పేద కుటుంబానికి వరాలను కురిపించారు. 

హైద్రాబాద్‌ షాపూర్‌నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మహిళా గర్జన సభలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.కేసీఆర్ పాలనలో డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు అన్యాయం జరిగిందని ఉత్తమ్ చెప్పారు. రాష్ట్రంలోని కోటి 90 లక్షల మంది మహిళలు ఉంటే ఒక్క మహిళకు కూడ  మంత్రిపదవిని ఇవ్వలేదన్నారు.  మంత్రి పదవికి మహిళలు అవసరం లేదన్నారు. కానీ, మహిళల ఓట్లు  కేసీఆర్‌కు అవసరమా అని ఉత్తమ్ ప్రశ్నించారు.

బ్యాంకు రుణాలపై వడ్డీ రుణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  కేసీఆర్ పాలనలో మహిళా సంఘాలకు కొత్త భవనాలు నిర్మించలేదన్నారు.  

కొత్తగా బ్యాంకు రుణాలు ఇప్పించలేదన్నారు.  మహిళా సంఘాల నుండి వచ్చిన సొమ్ము (అభయ హస్తం కింద) వసూలు చేసిన డబ్బులను కేసీఆర్ స్వాహా చేశారని కేసీఆర్ ఆరోపించారు.

ఈ ఏడాది డిసెంబర్ 12 వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఉత్తమ్ విశ్వాసాన్ని  వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన  100 రోజుల్లోపుగా ఆరు లక్షల మహిళా సంఘాలకు  లక్ష రూపాయాలను గ్రాంట్‌గా ఇవ్వనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావడానికి వీలుగా బ్యాంకుల ద్వారా రూ. 10 లక్షలను  ఇప్పిస్తామని ఆయన చెప్పారు. రూ. 10 లక్షల రుణం వడ్డీ భారం  కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తోందన్నారు.

మహిళా సంఘాలకు అభయ హస్తం పెన్షన్ స్కీమ్‌ను పునరుద్దరించి పెన్షన్  ఇస్తామని ఉత్తమ్  హామీ ఇచ్చారు. అభయహస్తం స్కీమ్ కింద పెన్షన్‌ను మరింత పెంచనున్నట్టు ఆయన తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ హాయంలో  ఆర్పీ, భీమా మిత్రల, వీఏఓలకు నెలకు రూ. 10 వేలు వేతనాన్ని ఇవ్వనున్నట్టు ఉత్తమ్  హమీ ఇచ్చారు.సెర్ఫ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్నారు.

మహిళా సంఘాల సభ్యుల్లోని కుటుంబసభ్యులకు అనారోగ్యానికి గురైతే  వారికి వైద్య చికిత్స కోసం  రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. 
ఎవరైనా  మహిళా సంఘాల సభ్యుల్లోని సభ్యులు  మృతి చెందితే  రూ.5 లక్షలను చెల్లించనున్నట్టు ఉత్తమ్ చెప్పారు. తెల్లకార్డులున్న  కుటుంబాలకు  ప్రతి ఏటా ఆరు  గ్యాస్ సిలిండర్లను ఉచితంగా  అందిస్తామని   ఉత్తమ్ హామీ ఇచ్చారు. 

పీడీఎస్ కింద సరఫరా చేసే దొడ్డు బియ్యానికి బదులుగా  సన్న బియ్యాన్ని సరఫరా చేస్తామని ఉత్తమ్ చెప్పారు. కుటుంబంలోని ఒక్కొక్క సభ్యుడికి ఏడు కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తామని చెప్పారు.

అమ్మ హస్తం కింద కూడ సన్న నిత్యావసర సరుకులను సరఫరా చేస్తామన్నారు.దళితులు, గిరిజనులకు రేషన్ బియ్యంతో పాటు 9 రకాల నిత్యావసరసరకులను ఉచితంగా ఇస్తామని హమీ ఇచ్చారు.దళితులు, గిరిజనులకు 200 యూనిట్ల  విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు.  

సంబంధిత వార్తలు

నా చుట్టూ, గాంధీభవన్ చుట్టూ తిరిగితే టిక్కెట్లు రావు: ఉత్తమ్

డిఫెన్స్‌లో కేసీఆర్: చంద్రబాబు టార్గెట్ అందుకే...

చంద్రబాబు పడగొట్టాలని చూశాడు, ఓవైసీ చెప్పారు: కేసిఆర్

చంద్రబాబూ! నేను మూడో కన్ను తెరిస్తే....: కేసీఆర్

టీడీపీ నేతలు చంద్రబాబు గులామ్‌లు: కేసీఆర్

టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం

కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మ ళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?

 

Follow Us:
Download App:
  • android
  • ios