Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కోట: గజ్వెల్ సీటు చరిత్ర, సెంటి మెంట్ ఇదీ....

 గజ్వేల్ నియోజకవర్గం అంటేనే దానికి ఒక ప్రత్యేకత. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రాష్ట్రాధినేతగా పంపింది ఈ నియోజకవర్గమే. విభిన్న సంస్కృతికి నిలయంగా పేరుగాంచిన నియోజకజవర్గం గజ్వేల్. 
 

Sentiment on Gajwel seat, won by KCR in 2014 Elections
Author
Gajwel, First Published Nov 13, 2018, 4:57 PM IST

గజ్వేల్‌ : గజ్వేల్ నియోజకవర్గం అంటేనే దానికి ఒక ప్రత్యేకత. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రాష్ట్రాధినేతగా పంపింది ఈ నియోజకవర్గమే. విభిన్న సంస్కృతికి నిలయంగా పేరుగాంచిన నియోజకజవర్గం గజ్వేల్. 

ఎందరో ఉద్యమకారులకు, కవులు, కళాకారులకు జన్మనిచ్చిన గడ్డ గజ్వేల్ గడ్డ. గుజరాతీలు, కేరళీయులు, వివిధ మతస్థులు జాతుల సంగమంతో ఈ నియోజకవర్గం మినీ ఇండియాగా అభివర్ణించబడుతుంది. 

అంతేకాదు ఈ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు సైతం ఉంది. స్థానికేతరులకు అచొచ్చిన నియోకవర్గంగా ఒకటైతే ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే అధికారంలోకి రావడం మరో ప్రత్యేకత. ఇకపోతే ఈ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం వాసుదేవ్ నుంచి 2014లో గెలిచిన కేసీఆర్ వరకు అంతా స్థానికేతరులే. 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండేం వాసుదేవ్, 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో పనిచేసిన జేబీ ముత్యాలరావు, ఆర్‌.నర్సింహ్మారెడ్డ వీళ్లంతా స్థానికేతరులే. 

ఆ తర్వాత 1962లో నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో ఎస్సీలు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత 1983లో అల్లం సాయిలు, 1985లో సంజీవరావు, 1989, 2004లలో డాక్టర్‌ జే.గీతారెడ్డి, 1994లో డాక్టర్‌ జీ.విజయరామారావు, 1999లో సంజీవరావులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరంతా స్థానికేతరులే కావడం విశేషం. 

అయితే 2009లో ఈ నియోజకవర్గం జనరల్ అయ్యింది. దీంతో 2009లో జరిగిన ఎన్నికల్లో తూంకుంట నర్సారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ చీఫ్ పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడమే కాకుండా స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కేసీఆర్. కేసీఆర్ కూడా స్థానికేతరుడు కావడం విశేషం.

ఇకపోతే ఈ నియోజకవర్గంలో జరిగిన 13 ఎన్నికలు పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీయే అధికారంలోకి రావడం విశేషం. అందువల్లే కేసీఆర్ సైతం అదే సెంటిమెంట్ ను బలంగా నమ్ముతున్నారు. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్నిసెంటిమెంట్‌గా ఎంచుకున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అనుకున్న విధంగానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

వాస్తవానికి 2008లోనే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ గజ్వేల్ లో పాగా వేశారు. గజ్వేల్ లోనే ఫామ్ హౌస్ ను ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేస్తూ తన ఇలాకాగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనగా తీర్చిదిద్దుతున్నారు. 
 
13 ఎన్నికల్లో గెలిచిన పార్టీయే అధికారంలోకి రావడం, తాను పోటీ చేసి గెలిచి అధికారంలోకి రావడంతో మళ్లీ అదే సెంటిమెంట్ ను బలంగా నమ్ముతున్నారు కేసీఆర్. అభివృద్ధే అజెండాగా కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. చేసింది గోరంత చెయ్యాల్సింది కొండంత ఉందని తనన మళ్లీ గెలిపించాలని కోరుతున్నారు. 

అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సైతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. గతంలో రెండుసార్లు ఓడిపోవడంతో ఆ సానుభూతి కలిసొస్తుందని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ప్రచార అస్త్రాలుగా మలుచుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

తిరుగులేని ముహుర్తంలో కేసీఆర్ నామినేషన్: ఇక రాజయోగమేనా

కేసీఆర్ కోట: గజ్వెల్ సీటు చరిత్ర, సెంటి మెంట్ ఇదీ....

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత
ఆ 12 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే: ఉత్తమ్‌ను ఢీకొనేది అతనే

గ్రేటర్‌లో సగం సీట్లు మనవే: కేసీఆర్, ఆ స్థానాల్లో ఊహించని పేర్లు

ఆ 14 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు కేసీఆర్ కసరత్తు, అదృష్టం ఎవరిదో?

సెంటిమెంట్: అమావాస్య రోజున పోలింగ్, కేసీఆర్‌కు కలిసొచ్చేనా?

తప్పిన కేసీఆర్ లెక్క.....ఎన్నికల్లో కనిపించని లక్కీ నంబర్

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై ఉత్కంఠ: చివర్లో ట్విస్ట్ ఇచ్చిన సిఈసీ
ఓటుకు నోటులో ఉంది నువ్వు కాదా: చంద్రబాబుకు కేసీఆర్ సవాల్

Follow Us:
Download App:
  • android
  • ios