మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఇటీవల గజ్వెల్ కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాపరెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. తన మామ కేసీఆర్ ను ఓడించడం కోసం హరీష్ పనిచేస్తున్నట్లు ఆరోపించారు.  అయితే ఆయన ఆరోపణల్ని ఖండించిన హరీష్ దమ్ముంటే ఆధారాలతో బైటపెట్టాలని వంటేరుకు సవాల్ విసిరారు. ఈ సవాల్ పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 

 ఏ క్షణమైనా టీఆర్ఎస్ పార్టీ కుండ పగిలే అవకాశం ఉందంటూ...ఇందుకు హరీష్ రావే కారణమవుతారని రేవంత్ పేర్కొన్నారు. గత నెల 25వ తేదీన మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ నర్సారెడ్డిని తీసుకుని రాత్రి 9 గంటలకు హరీష్ రావు ఇంటికి తీసుకెళ్లారని తెలిపారు. వీరి మధ్య దాదాపు 3 గంట పాటు చర్చలు జరిగాయని...ఆ మరుసటి రోజే నర్సారెడ్డి డిల్లీకి వెళ్లి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని రేవంత్ వెల్లడించారు. కావాలంటే మంత్రుల నివాసాల వద్ద ఉండే సిసి కెమెరా రికార్డులను పరిశీలిస్తే ఆ రోజు హరీష్ నివాసానికి ఎవరెవరు వెళ్లారో తెలుస్తుందన్నారు.

 కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేరి ఓ కార్పోరేషన్ పదవిలో వున్న నర్సారెడ్డి కాంగ్రెస్ లో చేరడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రేవంత్ ఆరోపించారు. ప్రస్తుతం హరీష్, కేసీఆర్ కు మధ్య సంబంధాలు ఉప్పునిప్పులా ఉన్నాయని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం తుఫానుకు ముందు నిశ్శబ్దం కొనసాగుతోందని రేవంత్ తెలిపారు. 

ప్రస్తుతం వేగంతో దూసుకుపోతున్న కారు డ్రైవర్ న మార్చబోమని కేటీఆర్ ప్రజలకు చెబుతున్నారు కానీ ఆయన బావే డ్రైవర్ ను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. తనతో రహస్య సమావేశం తర్వాత రోజే నర్సారెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో ఎందుకు చేరారో హరీష్ సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.   

మరిన్ని వార్తలు

ఆధారాలున్నాయి: హరీష్ పై మరోసారి వంటేరు సంచలనం

 

పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు: వంటేరుకు హరీష్ కౌంటర్ (వీడియో)

రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇష్యూ: లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?