Asianet News TeluguAsianet News Telugu

ఐటీ అధికారుల విచారణకు హాజరైన రేవంత్

ఆస్తుల కేసులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం నాడు ఆదాయపు పన్ను శాఖాధికారుల విచారణకు హాజరయ్యారు.
 

revanth reddy attends income tax officer enquiry
Author
Hyderabad, First Published Oct 3, 2018, 11:50 AM IST


హైదరాబాద్: ఆస్తుల కేసులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం నాడు ఆదాయపు పన్ను శాఖాధికారుల విచారణకు హాజరయ్యారు.

వారం రోజుల క్రితం  రేవంత్ రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖాధికారులు  సుమారు 41 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లభించిన డాక్యుమెంట్ల ఆధారంగా ఐటీ అధికారులు విచారణకు రావాలని రేవంత్ రెడ్డికి నోటీసులు అందించారు.

రేవంత్ రెడ్డితో పాటు ఓటుకు నోటు కేసులో  కీలక నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహలను కూడ విచారించనున్నారు. మరో వైపు  రేవంత్ రెడ్డి సోదరుడు  కొండల్ రెడ్డిని కూడ  ఈ కేసులో విచారిస్తున్నారు.

టుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి  స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయనే విషయమై  ఆదాయపు పన్ను శాఖాధికారులు ప్రశ్నించనున్నారు. మరో వైపు ఇదే కేసులో  ఉదయ సింహా, సెబాస్టియన్‌లను విచారించనున్నారు.

స్టీఫెన్‌సన్‌కు నాలుగున్నర కోట్లను ఎలా ఇస్తారనే విషయమై రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. బుధవారం నాడు ప్రధానంగా జరిగే విచారణలో ఓటుకు నోటు కేసుపైనే ప్రధానంగా ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.

 

సంబంధిత వార్తలు

ఆస్తుల కేసు: ఐటీ అధికారుల విచారణకు కాసేపట్లో రేవంత్ రెడ్డి

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

రేవంత్ చుట్టూ ఉచ్చు: ఉప్పల్ లో తేలిన ఉదయసింహ ఫ్రెండ్ రణధీర్

ఐటి దాడులు: ఉదయసింహ సంచలన ప్రకటన

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారుల

 

Follow Us:
Download App:
  • android
  • ios