Asianet News TeluguAsianet News Telugu

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి కాస్తా ఘాటుగానే స్పందించారు. తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని ఆయన అన్నారు.

Revanth reddy reacts on IT raids
Author
Hyderabad, First Published Sep 29, 2018, 1:23 PM IST

హైదరాబాద్: తనపై జరిగిన ఆదాయం పన్ను దాడులపై తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. దాదాపు 43 గంటల పాటు ఆయనను ఐటి, ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. దాదాపు 150 ప్రశ్నలకు రేవంత్ రెడ్డి నుంచి వారు రాతపూర్వకమైన సమాధానాలు తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో మూడు సీటు కేసుల్లో డాక్యుమెంట్లను కూడా సర్గుకుని పోయినట్లు చెబుతున్నారు. 

ఆ సోదాలపై రేవంత్ రెడ్డి కాస్తా ఘాటుగానే స్పందించారు. తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని ఆయన అన్నారు. కొంత కాలంగా కాంగ్రెసు నేతలపై ప్రభుత్వం కేసులు పెడుతోందని, అభద్రతా భావంతోనే ప్రభుత్వం ఆ కేసులు పెడుతోందని ఆయన అన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగానే దాడులు జరుగుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. తాను 2009లో ప్రస్తావించిన ఆస్తులతో 2014లో ప్రస్తావించిన ఆస్తులను పోల్చి చూడాలని ఆయన అన్నారు. 2009 తర్వాత తాను ఒక్క ఆస్తి కూడా కొనలేదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు: న్యాయవాది రామారావు చరిత్ర ఇదీ...

ఐటి సోదాలు: రేవంత్ ఇంటి వద్ద పరిస్థితి (ఫొటోలు)

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

రేవంత్ ఇంట్లో ఐటీ దాడులపై చంద్రబాబు స్పందన ఇది

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారులు

రేవంత్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి ఆరా తీస్తున్న ఐటీ అధికారులు

24 గంటలుగా సోదాలు.. రాత్రంతా రేవంత్‌పై ప్రశ్నల వర్షం

రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

అప్పుడు నా కూతురి లగ్న పత్రిక రోజే...ఇప్పుడు మళ్లీ : రేవంత్ ఆవేదన

జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి

కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

తాళాలు పగలకొట్టి మరీ రేవంత్ ఇంట్లోకి అధికారులు

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

 

Follow Us:
Download App:
  • android
  • ios