Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

రేవంత్ రెడ్డి నివాసంలో ఆదాయం పన్ను శాఖ నిర్వహించిన సోదాలు ముగిశాయి. గురువారం రాత్రి ప్రారంభమైన సోదాలు శనివారం తెల్లవారు జామున 2.30 గంటలకు ముగిశాయి.

IT raids in Revanth Reddy's house completed
Author
Hyderabad, First Published Sep 29, 2018, 7:58 AM IST

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసంలో ఆదాయం పన్ను శాఖ నిర్వహించిన సోదాలు ముగిశాయి. గురువారం రాత్రి ప్రారంభమైన సోదాలు శనివారం తెల్లవారు జామున 2.30 గంటలకు ముగిశాయి.

ఈ సోదాల్లో ఐటి అధికారులు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 3వ తేదీన ఐటీ శాఖ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని రేవంత్‌రెడ్డిని ఆదేశించారు.

రేవంత్ రెడ్డి నివాసంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో రూ.20 కోట్ల విలువ చేసే లెక్కలు చూపని ఆస్తులు ఉన్నట్లు ఐటి అధికారులు గుర్తించారు. ఈ మొత్తం రేవంత్‌ రెడ్డి బావమరిది జయప్రకాశ్‌ రెడ్డికి చెందిన శ్రీ సాయిమౌర్య ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిందని అంటున్ారు. 

ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్లు, ఆదాయపు పన్ను శాఖకు దాఖలు చేసిన అఫిడవిట్లు దగ్గర పెట్టుకుని అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. శ్రీ సాయిమౌర్య ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 2011 తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం లేదని తెలుస్తోంది. 

లెక్క చూపని రూ. 20 కోట్లకు సంబంధించి 30 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రేవంత్‌ రెడ్డి భార్య గీత బ్యాంక్‌ లాకర్‌ను తెరిపించిన అధికారులు 560 గ్రాముల బంగారాన్ని, కొన్ని ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి మామ పద్మారెడ్డి ఇంట్లోనూ 10 లక్షల నగదు లభ్యమైంది. 

రేవంత్‌ నివాసంలో కొన్ని వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాల విలువను అంచనా వేసేందుకు నిపుణులను రప్పించారు. రేవంత్‌రెడ్డి ఫోన్లను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఫోన్లతోపాటు గురువారం స్వాధీనం చేసుకున్న కంప్యూటర్‌ హార్డ్‌డిస్కులను సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీకి చెందిన నిపుణులను పిలిచి అప్పగించారు. న్యాయస్థానం అనుమతితో  వాటిని విశ్లేషించి అందులో ఉన్న సమాచారాన్ని తీసి నివేదిక సమర్పిస్తారు.

సంబంధిత వార్తలు

రేవంత్ ఇంట్లో ఐటీ దాడులపై చంద్రబాబు స్పందన ఇది

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారులు

రేవంత్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి ఆరా తీస్తున్న ఐటీ అధికారులు

24 గంటలుగా సోదాలు.. రాత్రంతా రేవంత్‌పై ప్రశ్నల వర్షం

రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

అప్పుడు నా కూతురి లగ్న పత్రిక రోజే...ఇప్పుడు మళ్లీ : రేవంత్ ఆవేదన

జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి

కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

తాళాలు పగలకొట్టి మరీ రేవంత్ ఇంట్లోకి అధికారులు

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

Follow Us:
Download App:
  • android
  • ios