Asianet News TeluguAsianet News Telugu

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

రేవంత్‌ రెడ్డికి చెందిన మూడు బ్యాంకుల్లో లాకర్లను ఐటీ శాఖ అధికారులు  సోదాలు నిర్వహించారు

income tax officers continues searching in revanth reddy house
Author
Hyderabad, First Published Sep 28, 2018, 5:29 PM IST

హైదరాబాద్:రేవంత్‌ రెడ్డికి చెందిన మూడు బ్యాంకుల్లో లాకర్లను ఐటీ శాఖ అధికారులు  సోదాలు నిర్వహించారు. లాకర్ల నుండి  పెద్ద ఎత్తున ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నారు.

రెండో రోజు కూడ రేవంత్ రెడ్డి ఇంట్లో  ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతన్నాయి రేవంత్ రెడ్డి షెల్ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున నిధులను తన కుటుంబసభ్యుల ఖాతాల్లోకి మళ్లించారని ఐటీ అధికారులు గుర్తించారు. 

శుక్రవారం నాడు రేవంత్ రెడ్డి సతీమణి గీత ద్వారా మూడు బ్యాంకుల్లో ఉన్న లాకర్లను ఓపెన్ చేసి కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నారని సమాచారం. 19 షెల్ కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని కూడ ఐటీ  అధికారులు సేకరించారని సమాచారం.

రేవంత్ రెడ్డికి ప్రతి ఏటా రూ.6 లక్షల వార్షికాదాయంగా చూపించారు. రేవంత్ రెడ్డి భార్యగీత వార్షికాదాయం రూ.7లక్షలకు చూపారు. ప్రతి ఏటా వీరిద్దరికి రూ.13 లక్షలుగా ఉంది.  అయితే ఓ భవనం నిర్మాణం కోసం  కోటిన్నర రుణం  తీసుకొన్నారు. దీనికి గాను ప్రతి నెల రూ.లక్షఈఎంఐ కింద చెల్లిస్తున్నారు. ఈఎంఐ కింద డబ్బులు చెల్లింపుకు డబ్బులు ఎలా వస్తోందనే విషయంపై రేవంత్ ను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్ కు  కూడ ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 2వ తేదీ లోపుగా సమాచారాన్ని ఇవ్వాలని ఐటీ అధికారులు  ఆదేశించినట్టు సమాచారం. 

కొన్ని షెల్ కంపెనీల నుండి ఉదయసింహతో పాటు సెబాస్టియన్ ఖాతాల్లోకి నిధులు వచ్చాయనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ విషయమై కూడ  ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

రేవంత్ ఇంట్లోని కంప్యూటర్‌లో ఏదైనా సమాచారాన్ని డిలీట్ చేశారా అనే కోణంలో కూడ ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎప్ఎస్ఎల్ అధికారులు కంప్యూటర్ లో నుండి డిలీట్ చేసిన సమాచారం ఏదైనా ఉందా..... దాన్ని రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 

మరోవైపు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన మూడు ఇళ్లలో కూడ  ఐటీ అధికారులు విచారణ జరిపారు. రేవంత్ రె్డికి కూతురు, ఆయన భార్య గీతకు చెందిన బ్యాంకు అకౌంట్లపై ఆరా తీస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారులు

రేవంత్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి ఆరా తీస్తున్న ఐటీ అధికారులు

24 గంటలుగా సోదాలు.. రాత్రంతా రేవంత్‌పై ప్రశ్నల వర్షం

రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

అప్పుడు నా కూతురి లగ్న పత్రిక రోజే...ఇప్పుడు మళ్లీ : రేవంత్ ఆవేదన

జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి

కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

తాళాలు పగలకొట్టి మరీ రేవంత్ ఇంట్లోకి అధికారులు

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

 

Follow Us:
Download App:
  • android
  • ios