Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ చుట్టూ ఉచ్చు: ఉప్పల్ లో తేలిన ఉదయసింహ ఫ్రెండ్ రణధీర్

ఉదయసింహకు సన్నిహితుడైన రణధీర్ నివాసంలో ఆదివారంనాడు ఐటి దాడులు జరిగాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, వారు ఐటి అధికారులు కారని ఉదయసింహ సోమవారం చెప్పారు. ఎవరు తీసుకుని వెళ్లారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Ranadheer Reddy surfaces at Uppal
Author
Hyderabad, First Published Oct 2, 2018, 10:17 AM IST

హైదరాబాద్: దాడుల తర్వాత కనిపించకుండా పోయాడని చెబుతున్న ఓటుకు నోటు కేసు నిందితుడు ఉదయసింహ మిత్రుడు రణధీర్ రెడ్డి ఉప్పల్ లో ప్రత్యక్షమయ్యాడు. ఐటి అధికారుల పేరుతో రణధీర్ ఇంట్లో ఆగంతకులు సోదాలు నిర్వహించారని ఉదయసింహ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, తన ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు చేశారని, తనను వాళ్లే తీసుకుని వెళ్లారని రణధీర్ రెడ్డి చెబుతున్నారు. 

తన వద్ద హార్డ్ డిస్క్ మాత్రమే టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకున్నారని, అది ఉదయసింహకు చెందిన హార్డ్ డిస్క్ అని రణధీర్ అంటున్నారు. మూడు నెలల క్రితం ఇల్లు మారుతున్నానంటూ తనకు ఉదయసింహ ఆ హార్డ్ డిస్క్ ఇచ్చారని, అందులో ఏముందో తనకు తెలియదని ఆయన అన్నారు. 

ఉదయసింహకు సన్నిహితుడైన రణధీర్ నివాసంలో ఆదివారంనాడు ఐటి దాడులు జరిగాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, వారు ఐటి అధికారులు కారని ఉదయసింహ సోమవారం చెప్పారు. ఎవరు తీసుకుని వెళ్లారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులు తనను తీసుకుని వెళ్లి విచారించారని, రెండు రోజుల తర్వాత విచారణకు మళ్లీ హాజరు కావాలని సూచించారని రణధీర్ రెడ్డి చెబుతున్నారు. ఉదయసింహ తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని రణధీర్ చెప్పారు. హార్డ్ డిస్క్ మాత్రమే టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకున్నారని, మరేదీ తీసుకోలేదని ఆయన చెప్పారు. 

రణధీర్ చెప్పిన విషయాలతో ఉదయసింహ చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్ రెడ్డి చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆ హార్డ్ డిస్క్ లో ఏముందో తెలితే అసలు విషయాలు బయటకు రావచ్చునని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఐటి దాడులు: ఉదయసింహ సంచలన ప్రకటన

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారుల

Follow Us:
Download App:
  • android
  • ios