నివాస గృహాల మధ్య రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్న వారి గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచారం చేస్తున్న యువతులను, నిర్వాహకులను అరెస్టు చేశారు.  ఈ సంఘటన పంజాగుట్టలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పంజాగుట్టలో బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు.  ఎల్లారెడ్డిగూడలోని శ్రీతి నిలయం అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందడంతో ఎస్సై మహ్మద్ జాహిద్ ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. క్రైమ్ ఇన్ స్పెక్టర్ నాగయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన పోలీసులు నిర్వాహకులు భాను ప్రకాష్, పవన్ లతోపాటు నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాన నిర్వాహకుడు కుమార్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు ేసుకున్న పోలీసులు నిర్వాహాకులను రిమాండ్ కి తరలించారు. రైడ్ లో దొరికిన యువతులను రెస్క్యూ హోంకి తరలించారు.