పేరుకి  అతను ఓ ఛార్టెడ్ అకౌంటెంట్. కానీ చేసేది మాత్రం చెత్త పనులే. డబ్బు సంపాదించడానికి అమ్మాయిల నగ్న  చిత్రాలను డేటింగ్ యాప్ లలో పెడుతూ.. యువకుల నుంచి డబ్బులు గుంజుతుంటాడు. కనీసం తమ ఫోటోలు డేటింగ్ యాప్ లలో ఉన్నయన్న విషయం కూడా సదరు అమ్మాయిలకు తెలియకపోవడం గమనార్హం. ఆలస్యంగా పోలీసుల దృష్టికి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

విజయనగరానికి చెందిన వెన్నెల వెంకటేష్.. విజయవాడలో సీఎ చదువుకుంటున్నాడు. అయితే.. సులభంగా డబ్బు సంపాదించేందుకు వెంకటేష్ డేటింగ్ యాప్ లను ఎంచుకున్నాడు. అందులో ఇన్ స్టాగ్రామ్ లో అందమైన అమ్మాయిల ఫోటోలను డౌన్ లోడ్ చేసేవాడు. వాటిని ఫోటో షాప్ లో కాస్త ఎడిట్ చేసి టిండర్ డేటింగ్ యాప్ లో పెట్టేవాడు.

Also Read సహజీవనం చేశాడు.... తీసుకున్న బాకీ తీర్చమన్నందుకు...

ఆ ఫోటోల కింద ఆసక్తి ఉన్నవారు సంప్రదించవచ్చు అంటూ ఫోన్ నెంబర్ ఫెట్టేవాడు. నిజంగా అమ్మాయే అనుకొని చాలా మంది అబ్బాయిలు కాంటాక్ట్ అయ్యేవాళ్లు. వాళ్ల దగ్గర నుంచి సెక్సీ చాట్ చేయడానికి యువకుల నుంచి డబ్బులు గుంజేవాడు. ఇలా కొంతకాలంగా చేస్తూ వస్తున్నాడు. కాగా ఇటీవల
  టిండర్ డేటింగ్ యాప్ లో తన ఫోటోలు ఉన్నట్లు బంజారాహిల్స్ కి చెందిన ఓ యువతి గుర్తించింది.

వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని గుట్టంతా బయటకు తీశారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు.