తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర వైపునుండి తెలంగాణకు వస్తున్న ఓ కారును ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు టెకీలలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.