Asianet News TeluguAsianet News Telugu

తెరపైకి మళ్లీ కూటమి: రమణ‌కు కుంతియా, ఉత్తమ్‌ ఫోన్

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను మళ్లీ ప్రయత్నాలను ప్రారంభించింది.

congress leader rc kuntia phoned to ttdp leader ramana
Author
Hyderabad, First Published Mar 22, 2019, 1:59 PM IST

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను మళ్లీ ప్రయత్నాలను ప్రారంభించింది. శుక్రవారం నాడు టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ‌కు కాంగ్రెస్ పార్టీ నేతలు ఫోన్ చేశారు.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రజా కూటమి పేరుతో నాలుగు పార్టీలు కలిసి పోటీ చేశాయి. కాంగ్రస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితిలు  పోటీ చేశాయి.

ఈ కూటమికి ఈ ఎన్నికల్లో  మెరుగైన ఫలితాలు రాలేదు. కాంగ్రెస్ పార్టీకి 19, టీడీపీకి రెండు అసెంబ్లీ సీట్లు దక్కాయి. అయితే సీపీఐ, జనసమితికి ఒక్క సీటు కూడ రాలేదు.

తెలంగాణలో ఐదు ఎంపీ సీట్లలో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడ ఎల్. రమణ‌కు ఫోన్ చేశారు.

అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చలకు సంబంధించి శుక్రవారం సాయంత్రం చర్చలు జరిగే అవకాశం ఉంది సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios