Asianet News TeluguAsianet News Telugu

సామూహిక కారుణ్య మరణాలకు అనుమతివ్వండి: హెచ్చార్సీకి గ్రూప్‌2 అభ్యర్ధులు

తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన నినాదం...నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో నీళ్లు, నిధుల విషయం అటుంచితే నియామకాల విషయంలో నూతన తెలంగాణ రాష్ట్రంలో తమకు అన్యాయం జరుగుతోందని ఇప్పటికే నిరుద్యోగ యువత ఆగ్రహంతో వున్నారు. తాము ఉద్యోగాలు, మంచి భవిష్యత్ కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నామని...అయితే ఆ కల ఇప్పట్లో నెరవేరేలా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  వీరి పరిస్థితి ఇలా ఉంటే...ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి మరోలా వుంది. 

telangana group 2 candidates agitation
Author
Hyderabad, First Published Mar 21, 2019, 7:15 PM IST

తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన నినాదం...నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో నీళ్లు, నిధుల విషయం అటుంచితే నియామకాల విషయంలో నూతన తెలంగాణ రాష్ట్రంలో తమకు అన్యాయం జరుగుతోందని ఇప్పటికే నిరుద్యోగ యువత ఆగ్రహంతో వున్నారు. తాము ఉద్యోగాలు, మంచి భవిష్యత్ కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నామని...అయితే ఆ కల ఇప్పట్లో నెరవేరేలా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  వీరి పరిస్థితి ఇలా ఉంటే...ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి మరోలా వుంది. 

నూతన రాష్ట్రం ఏర్పడి రెండేళ్ల నిరీక్షణ తర్వాత 2016లో టీఎస్‌పిఎస్సి గ్రూప్ 2 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికోసమే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ నిమాకాల కోసం రాతపరీక్ష నిర్వహించారు. ఇలా మూడేళ్ల క్రితమే ఫలితాలను కూడా విడుదల చేశారు. ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది.   

 ఈ ఫలితాలు, నియామక ప్రక్రియపై కొందరు అభ్యర్థులు కోర్డుకు వెళ్లడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఏ తప్పు చేయని అభ్యర్ధులకు ఉద్యోగాలు కల్పించాలని 2018 లో హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై కొందరు అభ్యర్థులు డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేశారు. ఇక్కడ కూడా సింగిల్ బెంచ్ తీర్పుకే మద్దతు లభించింది. కానీ టీఎస్‌పిఎస్సి, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది.దీంతో అటు ఉద్యోగం కోసం ఎదురుచూడలేక...ఇటు ఆశలు వదులుకుని వేరే ఉద్యోగం చేయలేక అభ్యర్థులు నరకం అనుభవిస్తున్నారు. 

దీంతో సమాజంలో తమపై గౌరవం తగ్గి చులకన భావం ఏర్పడిందని...అసలు తమకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం కోల్పోయారని ఉద్యోగార్థులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే టీఎస్‌పిఎస్సి, ప్రభుత్వం, హైకోర్టు సకాలంలో స్పందించి నిమాయమ ప్రక్రియ వేగవంతమై తమకు ఉద్యోగాలు వచ్చేలా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారు. లూదంటే తామందరికి సామూహిక మరణాలకు అనుమతివ్వాలని దాదాపు 300మంది అభ్యర్థులు హెచ్చార్సీని ఆశ్రయించడానికి సిద్దమయ్యారు.  ఈ నెల 22వ తేదీన తమ ఆవేధనను మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు అభ్యర్థులు తెలిపారు.  

Follow Us:
Download App:
  • android
  • ios