హైదరాబాద్: సికింద్రాబాదులోని ఆల్వాల్ లో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశారు. ఆరుగురితో కూడిన బీహారీ ముఠా ఈ పనికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

గురువారం హోలీ పర్వదినం సందర్భంగా పాపతో పాటు బిహారీ ముఠా సభ్యులు కూడా సంబరాలు చేసుకున్నారు. పిల్లలతో పాటు ఆడి పాడిన బిహారీ ముఠా సభ్యులు చివరకు ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేసినట్లు అనుమానిస్తున్నారు. 

మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు తమ కూతురి కోసం గాలింపు ప్రారంభించారు. చివరకు పాప అన్నయ్య తమతో ఆడిన వారు పాపను ఎత్తుకెళ్లిన విషయాన్ని చెప్పాడు. 

పాపను ముళ్లపొదల్లోకి తీసుకుని వెళ్లి దారుణంగా ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశారు.