Telangana News

Revanth Reddy's Offer for Telangana Women: New Dwakra Schemes?
Video Icon

తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి బంపరాఫర్.. డ్వాక్రా సంఘాలకు ఇన్నీ స్కీములా? | Asianet News Telugu

తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా అప్పక్పల్లెలో డ్వాక్రా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మహిళలతో ముఖాముఖిగా మాట్లాడారు. ఇకపై ఏడాదికి డ్వాక్రా మహిళలకు ఏడాదికి రెండు చీరలు అందజేస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూములను గుర్తించి డ్వాక్రా మహిళలతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయిస్తామని ప్రకటించారు. ఇలా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.