School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Telangana Holidays : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. ఏఏ రోజుల్లో సెలవులుండే అవకాశాలున్నాయో తెలుసా?

తెలంగాణలో వచ్చేవారం సెలవులే సెలవులు..
School Holidays : తెలంగాణలో వచ్చేవారం స్కూళ్లకు వరుస సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంల్లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వచ్చే గురువారం (డిసెంబర్ 11) మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10, 11 రెండ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా కొన్నిప్రాంతాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ఉండే అవకాశాలున్నాయి. ఈ సెలవులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా సెలవేనా?
సాధారణంగా ఏ ఎన్నికలైనా ప్రభుత్వ కార్యాలయలు లేదంటే పాఠశాలల్లో జరుగుతాయి. గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు తక్కువ కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లోనే పోలింగ్ జరుగుతుంది. ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా గ్రామాల్లోని పాఠశాలల్లోనే జరగనున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోనున్నారు. ఎన్నికల సిబ్బంది ముందురోజే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. కాబట్టి మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో డిసెంబర్ 10, 11 రెండ్రోజులు సెలవు ఉండే అవకాశాలున్నాయి.
కొన్ని గ్రామాల్లో ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా సెలవు ఉండే అవకాశాలున్నాయి. ఉపాధ్యాయులు, ఇతర పాఠశాల సిబ్బంది ఓటుహక్కును వినియోగించుకునేందుకు వీలుగా సెలవు ఇవ్వవచ్చు. కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలను కూడా పోలింగ్ కోసం ఉపయోగించుకునే అవకాశాలుంటాయి. ఇలా పలు కారణాలతో మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా డిసెంబర్ 10, 11న సెలవు ఉండవచ్చు.
తెలంగాణ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్
తెలంగాణలో పంచాయితీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలచేసి నామినేషన్ ప్రక్రియను కూడా పూర్తిచేసింది. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత పోలింగ్ జరగనుంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పోలింగ్... తర్వాత ఓట్ల లెక్కింపు, పలితాల వెల్లడి ఉంటుంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయాలు హీటెక్కాయి.
డిసెంబర్ 16, 17 సెలవేనా?
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ డిసెంబర్ 17న జరగనుంది. అంటే తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు డిసెంబర్ 16, 17 న కూడా సెలవుండే అవకాశాలున్నాయి. స్కూళ్లలోనే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తారు... ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో ఉపయోగిస్తారు... కాబట్టి పాఠశాలల నిర్వహణ సాధ్యంకాదు. అందుకే మూడో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్కూళ్లకు రెండ్రోజులు సెలవుండే అవకాశాలున్నాయి.
డిసెంబర్ 13, 14 ఎలాగూ సెలవే...
డిసెంబర్ 14న తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ జరగనుంది... ఆరోజు ఆదివారం కాబట్టి ఎలాగూ సాధారణ సెలవే. దీనికి ముందురోజు కూడా రెండో శనివారం కాబట్టి సెలవు ఉంటుంది. కాబట్టి రెండో విడత పంచాయతీ పోలింగ్ కోసం ప్రత్యేకంగా విద్యాసంస్ధలకు సెలవు ఇవ్వాల్సిన అవసరం లేదు.

