- Home
- Telangana
- School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
School Holidays : వచ్చేవారం తెలంగాణలో రెెండ్రోజులు సెలవులు కన్ఫర్మ్. మరో రెండ్రోజులు కూడా సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా నాల్రోజుల సెలవులు వస్తాయా?

వచ్చేవారం సెలవులే సెలవులు
Holidays : డిసెంబర్ లో క్రిస్మస్ తప్ప మరే పండగలు, ప్రత్యేక రోజులు లేవు... అందుకే ఈ నెలలో కేవలం ఒకటి రెండ్రోజులు మాత్రమే సెలవులుంటాయని అందరూ భావించారు. కానీ తెలంగాణలో వచ్చేవారం వరుస సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. ఓ రెండ్రోజుల సెలవులు ఖాయం కాగా మరో రెండ్రోజులు కూడా ప్రత్యేక సెలవులుండే అవకాశాలున్నాయి. ఇలా విద్యార్థులకే కాదు ఉద్యోగులకు నాలుగురోజులు సెలవులు రానున్నాయి.
డిసెంబర్ 13, 14 సెలవులు ఖాయం..
ప్రతి నెలలో రెండో శనివారం విద్యాసంస్థలు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది. ఈ డిసెంబర్ 13న రెండో శనివారం వస్తోంది... కాబట్టి సెలవు ఉంది. ఇక డిసెంబర్ 14న ఎలాగూ ఆదివారమే కాబట్టి మరో సెలవు వస్తోంది. ఇలా వచ్చే వీకెండ్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి.
ఈ రెండ్రోజుల సెలవులు రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల (డిసెంబర్ 14) పోలింగ్ కు కలిసిరానున్నాయి. రెండో విడత పోలింగ్ ఆదివారం జరగనుంది… కాబట్టి ప్రత్యేకంగా సెలవు ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట
డిసెంబర్ 10, 11, 16,17 సెలవేనా?
ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి... ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
అయితే మొదటి, మూడో దశ ఎన్నికలు జరిగే గ్రామాల్లో పోలింగ్ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలకు సెలవు ఉండే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎన్నికల విధులకోసం ఉపయోగించుకుంటారు. కాబట్టి మొదటి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో డిసెంబర్ 10,11... రెండో విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో డిసెంబర్ 16,17 తేదీల్లో సెలవుండే అవకాశాలున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలవులు
క్రిస్టియన్స్ ఎంతో ఘనంగా జరుపుకునే క్రిస్మస్ పండగ డిసెంబర్ లోనే ఉంటుంది. ఈ పండగ నేపథ్యంలో తెలంగాణలో రెండ్రోజులు (డిసెంబర్ 25 క్రిస్మస్, డిసెంబర్ 26 భాక్సిండ్ డే) అధికారిక సెలవులున్నాయి. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా పండక్కి ముందురోజు ఐచ్చిక సెలవు ఉంది. ఏపీలో మాత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సాధారణ సెలవు... డిసెంబర్ 24,26 తేదీల్లో ఐచ్చిక సెలవు ఉంది.
డిసెంబర్ లో వచ్చే మొత్తం సెలవులెన్ని?
ఈ డిసెంబర్ లో నాలుగు ఆదివారాలు, ఓ రెండో శనివారం, క్రిస్మస్ కి రెండ్రోజులు... తెలంగాణలో మొత్తం ఏడ్రోజుల సెలవులున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా అదనంగా మరో నాలుగురోజులు సెలవు వచ్చే అవకాశాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఈ డిసెంబర్ లో ఆరు రోజులు సెలవులున్నాయి.

