కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Central Government Jobs : తెలుగు యువతకు అద్భుత అవకాశం. కేవలం పదో తరగతి అర్హతతో స్వస్థలంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే ఛాన్స్ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే లైఫ్ సెట్…

తెలుగు యువతకు సూపర్ ఛాన్స్
Central Government Job : మంచి శాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... కేవలం పదో తరగతి అర్హతతోనే... అదీ హైదరాబాద్ లోనే పోస్టింగ్. తెలుగు యువతకు ఇంకేం కావాలి. అతి తక్కువ విద్యార్హతలతో మంచి గవర్నమెంట్ జాబ్ పొందే అద్భుత అవకాశం వచ్చింది. హైదరాబాద్ లోని CSIR - National Geophysical Research Institute (CSIR-NGRI) లో ఇటీవల ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ వెలువడింది.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఆండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. సైన్స్ ఆండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే స్వయంప్రతిపత్తి సంస్థ. CSIR-NGRI ప్రధాన కార్యాలయం హైదరాబాద్ ఉప్పల్ లో ఉంది... ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలోనే ఉద్యోగాలను పొందే సూపర్ ఛాన్స్ తెలుగు యువతకు వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం... అర్హతలుంటే వెంటనే అప్లై చేసుకొండి.
ఖాళీల వివరాలు
సెక్యూరిటీ ఆఫీసర్ - 01 పోస్ట్ (అన్ రిజర్వుడ్)
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 12 పోస్టులు ( 06 అన్ రిజర్వుడ్, 01 ఈడబ్ల్యుఎస్, ఓబిసి 04, ఎస్సి 01)
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 06 డిసెంబర్ 2025 (ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ : 05 జనవరి 2026 (6PM) వరకు అవకాశం.
దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్ www.ngri.res.in లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. మహిళలు, ఎస్సి/ఎస్టి, మాజీ సైనికులు, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు లేదు. మిగతా అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి. చివరి తేదీ వరకు చూడకుండా అర్హత ఉన్నవాళ్ళు త్వరగా అప్లై చేసి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
విద్యా, ఇతర అర్హతలు
మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు కేవలం పదో తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హతలుంటే చాలు. ఇంటర్మీడియట్ కూడా ఉండి సంబంధిత విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండేవారికి ప్రాధాన్యం ఇస్తారు.
సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగానికి మాత్రం మాజీ సైనికులు మాత్రమే అర్హులు. ఇండియన్ ఆర్మీలో కనీసం పదేళ్లపాటు పనిచేయడంతో పాటు సెక్యూరిటీ గా పనిచేసిన అనుభవం కూడా ఉండాలి.
విధులు :
మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు ఎంపికైనవారు రికార్డుల మెయింటెనెన్స్, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచడం, ఫైల్స్ ను వివిధ సెక్షన్లను తీసుకెళ్లడం, గెస్ట్ హౌస్ ల నిర్వహణ, టీ కాఫీలు అందించడం, కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
సెక్యూరిటీ ఆఫీసర్ హైదరాబాద్ లోని CSIR-NGRI పరిధిలోని గెస్ట్ హౌస్, హాస్టల్, స్టాప్ క్వార్టర్స్ భద్రతా వ్యవహారాలు చూసుకోవాలి.
వయో పరిమితి
మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు గరిష్ఠంగా 25 సంవత్సరాలలోపువారు అర్హులు. దరఖాస్తులకు చివరితేదీ అంటే 05 జనవరి 2026 నాటికి వయసును పరిగణలోకి తీసుకుంటారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC వారికి 3 ఏళ్లు, PwBD అభ్యర్థులకు అదనపు సడలింపు ఉంటుంది.
సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగానికి మాత్రం 35 ఏళ్లలోపువారు అర్హులు. వీరికి కూడా కొన్ని నిబంధనలకు లోబడి వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
మొదట ట్రేడ్ టెస్ట్, ఆ తర్వాత రాత పరీక్ష ఉంటుంది. పరీక్షలో వచ్చిన మార్కులు, ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి నియామకం చేస్తారు. తుది నియామకానికి ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది.
శాలరీ
సెక్యూరిటీ ఆఫీసర్ - రూ.44,900 నుండి రూ.1,42,400 వరకు శాలరీ ఉంటుంది. పే లెవెల్ 7 ప్రకారం శాలరీ ఉంటుంది.
మల్టీ టాస్కింగ్ పోస్ట్ - రూ.35,973 (లెవెల్ 1)
ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులన్నీ లభిస్తాయి.

