వేముల వాడ రాజన్న ఆలయంలో మత సామరస్యం వెల్లి విరిసింది. ఓ ముస్లిం మహిళ వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో కోడెను తిప్పి తన మొక్కు చెల్లించుకుంది. 

పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన అప్సర్ షాహిన అనే ముస్లింమహిళ మంగళవారం కోడె మొక్కుచెల్లించుకున్నారు. రాజన్న క్షేత్రంలో హిందూ ఆలయాలతోపాటు దర్గా కూడా ఉంది. కులమతాలకు అతీతంగా ఇక్కడ దర్శనాలు జరుగుతాయి. 

రాజన్నను దర్శించుకున్న వారు దర్గాను, దర్గాను దర్శించుకున్న వారు రాజన్నను దర్శించుకుంటుంటారు. ఇందులో భాగంగానే అప్సర్ షాహిన కోడెమొక్కు చెల్లించుకుని మతసామరస్యాన్ని ప్రదర్శించారు.