నిజామాబాద్: తాను తప్పు చేశానని ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ తనపై చర్యలు  ఎందుకు తీసుకోవడం లేదని ఎంపీ డి.శ్రీనివాస్ ప్రశ్నించారు.

గురువారం నాడు ఎంపీ డి.శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టే తాను కలిసినట్టుగా ఆయన చెప్పారు.తాను కాంగ్రెస్‌ను వీడడమే ఆశ్చర్యమన్నారు. 

తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ఫోకస్ పెట్టిందని  ఆయన అభిప్రాయపడ్డారు. తాను మితబాషినని ఆయన చెప్పారు. అనవసరంగా ఏ విషయాలపై తాను స్పందించబోనని ఆయన తేల్చి చెప్పారు.తాను స్పందించాల్సి వస్తే గట్టిగానే స్పందిస్తానని ఆయన స్పష్టం చేశారు. 

డి.శ్రీనివాస్ బీజేపీలో చేరుతారని  కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. తన తండ్రిని బిజేపీలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడ అరవింద్ కూడ ప్రకటించిన విషయం తెలిసిందే.

బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారానికి మాజీ మంత్రి డీ శ్రీనివాస్ ఖండించారు. తాను బీజేపీలో చేరుతున్నానన్న ప్రచారంలో నిజం లేదన్నారు. అదే  జరగాల్సిన సమయం వస్తే ఎవరు ఆపినా ఆగదని ఆయన కుండబద్దలు కొట్టారు. 

బీజేపీ అధినేత అమిత్‌షాను పార్లమెంట్‌లో మాత్రమే కలిశాను. సమస్యలు ఉన్నప్పుడు కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ తనను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి చాలా కష్టపడ్డారని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

తనపై చర్యలు తీసుకోవాలని ఏడాదిన్నర క్రితం అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు అధిష్ఠానం నుంచి రిప్లయ్ రాలేదు. భవిష్యత్‌లో కూడా రిప్లయ్ వస్తుందని అనుకోవడం లేదన్నారు.. ప్రజలు అంతా చూస్తూనే ఉన్నారు. ఏ తీర్పు ఇవ్వాలో వాళ్లకు తెలుసునని ఆయన చెప్పారు. హుజూర్‌నగర్ లో భిన్నమైన  రాజకీయం నడుస్తోందన్నారు.

సంబంధిత వార్తలు

డిఎస్ వ్యూహాత్మక అడుగులు: ఆ పదవిపై గురి...

కాంగ్రెస్‌లో డీఎస్ చేరిక: ముహూర్తమిదీ..

నందీశ్వర్‌గౌడ్, కేఎస్ రత్నంలకు కాంగ్రెస్ సీనియర్ల షాక్

భూపతిరెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్

ముహూర్తం ఖరారు: కాంగ్రెస్‌లోకి డీఎస్, కొండా సురేఖ

ఉప్పల్ కాంగ్రెస్‌లో చిచ్చు: అనుచరులతో రాజిరెడ్డి భేటీ, టీఆర్‌ఎస్‌లోకి

రాజకీయాల నుండి తప్పుకొంటా: ఎర్రబల్లి దయాకర్ రావు సంచలనం

సబితాను కలిసిన తర్వాతే కాంగ్రెస్‌లో చేరుతా: కేఎస్ రత్నం

టీఆర్ఎస్‌కు షాక్: ఉత్తమ్‌తో కేఎస్ రత్నం మంతనాలు, త్వరలోనే కాంగ్రెస్‌లోకి