హైదరాబాద్:  సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని  వారాసిగూడలో దారుణం చోటు చేసుకొంది. 17 ఏళ్ల బాలిక శుక్రవారంనాడు ఉదయం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అత్యాచారం చేసి బాలికను మేడపై నుండి కిందకు తోసేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Also read:సంగారెడ్డి జిల్లాలో దారుణం: మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్, ప్రాణాలు కాపాడిన డయల్ 100

 హైద్రాబాద్ వారాసిగూడకు 17 ఏళ్ల బాలిక శుక్రవారం నాడు ఉదయం శవంగా కన్పించే సరికి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఇంటర్ చదువుతున్న బాలిక తల్లి, సోదరుడితో కలిసి రెండంతస్తుల భవనంలో నివాసం ఉంటుంది శుక్రవారం నాడు ఉదయం ఈ భవనంలో ఉండే మహిళ భవనం పైకి ఎక్కిన సమయంలో రక్తపు మరకలు ఉండడాన్ని చూసి స్థానికులకు సమాచారం ఇచ్చింది.   రక్తం మరకలు ఉన్న ప్రాంతంలోనే బాలిక మృతదేహం పడి ఉంది.

 అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సీసీటీవి పుటేజీని కూడ పోలీసులు పరిశీలిస్తున్నారు.

రెండు అపార్ట్‌మెంట్ల మధ్య ఈ బాలిక మృతదేహం కన్పించింది.  సంఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ బాలిక తండ్రి ఏడాదిన్నర క్రితమే మృతి చెందాడు.ఈ బాలికపై అత్యాచారం చేసి హత్యా చేశారా అనే కోణంలో  కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.