పీరియడ్స్ లో రక్తం గడ్డలుగా పడుతోందా..? కారణం ఏంటి..?
ఇలా రక్తం గడ్డలు కట్టిపడటం అనేది కూడా చాలా సాధారణమేనా..? లేక ఇదేమైనా వ్యాధికి సంబంధించినదా అనే అనుమానాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
మహిళలకు ప్రతి నెలా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఆ పీరియడ్స్ సమయంలో మన బాడీ నుంచి రక్తం చాలా పోతుంది. విపరీతమైన కడుపులో నొప్పి, వెన్ను నొప్పి, మూడ్ స్వింగ్స్ లాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మూడు నుంచి ఐదు రోజుల పాటు.. మనకు రక్త స్రావం జరుగుతూ ఉంటుంది. ఇది సహజ ప్రక్రియ.
Periods
అయితే... కొందరికి పీరియడ్స్ సమయంలో రక్తం చాలా ఎక్కువగా పోతుంది. అంతేకాకుండా.. కొందరికి గడ్డకట్టినట్లుగా పడుతూ ఉంటుంది. ఇలా రక్తం గడ్డలు కట్టిపడటం అనేది కూడా చాలా సాధారణమేనా..? లేక ఇదేమైనా వ్యాధికి సంబంధించినదా అనే అనుమానాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని గురించి గైనకాలజిస్టులు ఏమని చెబుతున్నారో ఓసారి చూద్దాం..
పీరియడ్స్ సమయంలో బ్లడ్ క్లాట్స్ జెల్ లాగా.. చిన్నపాటి సైజులో ఉంటాయి. ఇది రుతుస్రావం సమయంలో గర్భాశయం నుంచి బయటకు వచ్చే ఒక రకమైన కణజాలం. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే... వాటిని చూసి మరీ ఎక్కువ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతినెలా.. పీరియడ్స్ వచ్చిన ప్రతిసారీ ఇలా గడ్డల రూపంలో పడుతున్నాయి అంటే మాత్రం.. అది కూడా పెద్ద పెద్ద గడ్డల్లా పడుతున్నాయి అంటే... కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.
Image: Getty
అలా గడ్డల రూపంలో పడుతున్నాయి... అంటే అధిక రక్త స్రావం జరుగుతోందని అర్థం.దీని కారణంగా శరీరంలో రక్తం లేకపోవడం , సంక్రమణ ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి..
పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు
దశలు ఋతు చక్రం
గర్భాశయంలో అడ్డుపడటం
ఫైబ్రాయిడ్ అంటే గర్భాశయంలో గడ్డ
ఎండోమెట్రియోసిస్
అడెనోమైయోసిస్
రుతువిరతి
గర్భాశయ క్యాన్సర్
సంక్రమణ
గర్భిణీ స్త్రీలకు రక్తం గడ్డకట్టినట్లయితే, అది గర్భస్రావాన్ని సూచిస్తుంది.