బిడ్డా నీ నాలుక చీరేస్తా, తస్మాత్ జాగ్రత్త:హరీష్ వార్నింగ్
టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీ నాలుక చీరేస్తా బిడ్డా జాగ్రత్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. గజ్వేల్ నియోజకవర్గంలో ముదిరాజ్ ల ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్న హరీష్ టీఆర్‌ఎస్‌లో అంతర్యుద్ధం జరుగుతోందని, ఏ క్షణంలోనైనా చీలిక రావచ్చని రేవూరి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.
గజ్వేల్: టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీ నాలుక చీరేస్తా బిడ్డా జాగ్రత్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. గజ్వేల్ నియోజకవర్గంలో ముదిరాజ్ ల ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్న హరీష్ టీఆర్‌ఎస్‌లో అంతర్యుద్ధం జరుగుతోందని, ఏ క్షణంలోనైనా చీలిక రావచ్చని రేవూరి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు గడిచినా మంచి నీళ్లు ఇయ్యని దిక్కుమాలిన వారంటూ కాంగ్రెస్, టీడీపీలపై ధ్వజమెత్తారు. డిసెంబర్ 11 తర్వాత తెలంగాణలో టీడీపీ కనుమరుగు అవుతుందని ఎద్దేవా చేశారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి, నర్సారెడ్డిలు జోగడు బాగాడు లెక్క తయారయ్యారని విమర్శించారు.
కేసీఆర్ వచ్చుడు సీఎం అవ్వడం మన అదృష్టమని అని హరీష్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ప్రతి చెరువు కుంటలు నిండాలని కేసీఆర్ అన్నారని, చెరువులు నింపుడు గీ కాంగ్రెస్ వాళ్లతో అయితదా మీరే ఆలోచించండని ప్రజలను కోరారు. కన్న కొడుకు చీరలు కొనియ్యక పోయినా మా అక్కచెల్లెలందరికీ కేసీఆర్ బతుకమ్మ చీరలు పంచాడని గుర్తు చేశారు.
ముదిరాజులు పాండవుల వంటి వారు న్యాయం వైపే ఉంటారని హరీష్ స్పష్టం చేశారు. న్యాయమే గెలుస్తుందని తెలిపారు. ఇంత గొప్ప సభను ఏర్పాటుచేసిన ముదిరాజ్ లకు ధన్యవాదాలు తెలిపారు. పదిహేడు సంవత్సరాల పాటు నా జీవితం గజ్వేల్నియోజకవర్గంలో కొనసాగిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు పక్కా భవనాలను నిర్మిస్తుందని గుర్తుచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
టీఆర్ఎస్‌లో హరీష్ స్థితిపై రేవూరి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబూ..! జాగ్రత్త: నీ రికార్డులు బయటపెడతాం: హరీష్ సంచలనం
పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు: వంటేరుకు హరీష్ కౌంటర్ (వీడియో)
రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు
టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇష్యూ: లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి
సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...
భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్
హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...
కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను
హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?