Asianet News TeluguAsianet News Telugu

క‌రోనా బూస్ట‌ర్ డోసులు స‌ర‌ఫ‌రా చేయండి.. కేంద్రానికి మంత్రి హరీష్ విజ్ఞప్తి.. 

కరోనా పరిస్థితులు రాష్ట్రాల సన్నద్ధతపై కేంద్ర వైద్యరోగ్య శాఖ మంత్రి మనసుక్ మాండవీయ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వీడియో సమీక్షలో మంత్రి హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా బూస్టర్ డోస్ పంపిణీ కి టీకాలు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.  అలాగే.. కరోనా కొత్త రకం వైరస్ పై అధ్యయన వివరాలు తెలపాలని కోరారు. 

Minister Harish Rao Asks Union Govt About Covid Booster Dose
Author
First Published Dec 24, 2022, 12:57 AM IST

కరోనా కొత్త వేరియంట్ చైనాతో పాటు పలు ఇతర దేశాలను వణికిస్తుంది. ఈ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో ఇప్పటికే భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కరోనా మార్గదర్శకాలు జారీచేసింది. తాజాగా శుక్రవారం నాడు కరోనా పరిస్థితులు, రాష్ట్రాల సన్నద్ధతపై కేంద్ర వైద్యరోగ్య శాఖ మంత్రి మ‌న్సూఖ్‌ మాండవీయ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫ‌రెన్స్‌ జరిగింది. కొన్ని మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ  జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కోవిడ్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోవిడ్ సర్వైలెన్స్‌ వ్యవస్థను పటిష్ట పర్చే దిశగా నిర్ణయాలను తీసుకుంది.

 
కేంద్ర వైద్యరోగ్య శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌ లో తెలంగాణ తరుఫున మంత్రి హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వానికి మంత్రి హరీష్ రావు పలు విజ్ఞప్తులు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కరోనా బూస్టర్ డోసులు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరారు.ప్రస్తుతం తెలంగాణలో కోవ్యాక్సిన్ 8 లక్షలు, కోవి షీల్డ్ 80 వేలు డోసులుండగా.. కోర్బివాక్స్ డోసులు లేవని తెలిపారు. రాష్ట్రంలో బూస్టర్ డోస్ ను వేగవంతం చేసిందుకు అవసరమైన వ్యాక్సిన్ లను రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరారు. తెలంగాణలో బూస్టర్ డోసు పంపిణీ వేగవంతంగా ఉందనీ, ఈ డోసుల విషయంలో జాతీయ సగటు 23 శాతం ఉంటే.. తెలంగాణ సగటు 48 శాతంగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ పర్యవేక్షణ, అప్రమత్తత, ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల ఈ ఘనత సాధ్యమైందన్నారు. 

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎఫ్ 7 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో..ఆ వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరు, ప్రభావం చేయు అంశాలు, చికిత్స విధానం వంటి అంశాలను రాష్ట్రాలకు తెలియజేయాలని, ఈ సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండడం సాధ్యం అవుతుందని అన్నారు. అలాగే.. గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని..ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా.. ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆక్సిజన్ ప్లాంట్స్ లను ఆసుపత్రులతో అనుసంధానం చేయాలని, ఈ మేరకు  మ్యాపింగ్ చేసే విధానాన్ని తీసుకురావాలన్నారు.

యాన్యువల్ మెంటెనెన్స్ కాంట్రాక్ట్ లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన వెంటిలేటర్లు, పిఎస్ఎ ప్లాంట్స్ మరమ్మతులు జరగటం లేదని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే.. ముందస్తు చర్యలో భాగంగా రాష్ట్రాల్లో ఈసీ ఆర్ పీ -3 (ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్ -3) రూపొందించే అంశాన్ని  ఆలోచించాలని సూచించారు. సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్రశేఖర్ రెడ్డి, డిఎంఇ రమేష్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాస్ రావు, తీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios