Asianet News TeluguAsianet News Telugu

డబ్బులిస్తే నగ్న చిత్రాలు పంపుతా... చివరికిలా

ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాను ప్రారంభించి తన క్లాస్‌మేట్‌ను  వేధింపులకు పాల్పడిన నవీన్‌కుమార్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Man held for harassing former classmate
Author
Hyderabad, First Published May 26, 2019, 10:45 AM IST

హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాను ప్రారంభించి తన క్లాస్‌మేట్‌ను  వేధింపులకు పాల్పడిన నవీన్‌కుమార్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా కేంద్రంలోని నిజాంపేట ఆదిత్య థియేటర్‌ ప్రాంతానికి చెందిన నర్సింగం నవీన్‌కుమార్ అక్కడే జడ్పీ సెంటర్‌లోని సన్ డయాగ్నస్టిక్‌‌లో పనిచేస్తున్నాడు.  కొత్తగూడెం జేవీఎస్ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివాడు.  ఆ సమయంలో బ్యాచ్ విద్యార్థులతో జీవీఎస్ బైపీసీ అనే వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.

ఈ గ్రూపులో పూర్వ విద్యార్ధిని ప్రేమిస్తున్నట్టుగా నవీన్ కుమార్  ప్రతిపాదించాడు.  ఈ ప్రతిపాదనను ఆ విద్యార్ధిని తిరస్కరించింది. దీంతో ఆ విద్యార్ధినిపై నవీన్ అదే గ్రూపులో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో నవీన్‌ను గ్రూపు నుండి తొలగించారు. దీంతో నవీన్‌ ఆ యువతిపై కక్ష పెంచుకొన్నాడు. ఈ నెల 18వ తేదీన నవీన్  బాధితురాలి వాట్సాప్‌కు మేసేజ్‌లు పంపాడు. దీంతో  నవీన్‌ నెంబర్‌ను యువతి బ్లాక్ చేసింది.

దరిమిలా బాధితురాలి పేరుతో నవీన్ నకిలీ ఫేస్ బుక్ ఖాతాను ప్రారంభించాడు. బాధితురాలి చిత్రాలను  ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. డబ్బలిస్తే చాటింగ్ చేస్తాను.. నగ్న వీడియోలను పంపుతానని పోస్ట్ పెట్టాడు. అంతేకాదు ఖమ్మం ఖానాపురం హవేలీ ఎస్‌బీఐ కాతా నెంబర్ ను కూడ ఇచ్చాడు. 

ఈ విషయం తెలిసిన బాధితురాలు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు ఆరాంఘర్‌లో ఉన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios