ఉత్తర భారత మీడియా సంస్థల సర్వేలు  దక్షిణ భారతీయ ఓటర్ల నాడి పట్టడంలో విఫలమయ్యాయని గతంలోనే వెల్లడయిందని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. గతంలో ఆ సంస్థలు తమిళ నాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో చేపట్టిన సర్వేలు తప్పని తేలాయని లగడపాటి తెలిపారు. తాను లోతుగా విశ్లేషించి ఈ సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నట్లు లగడపాటి తెలిపారు.

ఆగస్ట్ నుండి తమ సిబ్బంది సర్వే చేసి వేల షాంపిల్స్ సేకరించినట్లు లగడపాటి తెలిపారు. తెలంగాణ ప్రజలు హస్తం( మహా కూటమి) వైపే ఉన్నారని ఈ సర్వేల్లో  తేలిందని పేర్కోన్నారు. గతంలో తాను వెల్లడించినట్ల సర్వేలోని సీట్లకు అటూ ఇటుగా ప్రస్తుత పరిస్థితి కూడా ఉందని లగడపాటి వెల్లడించారు.   

 ప్రస్తుతం ప్రకటించిన సర్వేపై మళ్లీ పోస్ట్ పోల్ సర్వే కూడా చేయనున్నట్లు లగడపాటి తెలిపారు. అయితే అప్పుడు కూడా ఇవే ఫలితాలుంటాయని భావిస్తున్నానని...కానీ ఎగ్జాట్ నెంబర్ కోసమే ఈ పోస్ట్ పోల్ సర్వే చేస్తున్నట్లు తెలిపారు.

తాను రెండు జాతీయ సంస్థల సర్వేలను మాత్రమే నమ్ముతానని లగడపాటి వెల్లడించారు.  టుడే చాణక్య, యాక్సిస్ సర్వేలు మాత్రమే ఖచ్చితమైన వివరాలు ఇస్తారని...కానీ అవి కూడా దక్షిణ భారతంలో వెల్లడించే సర్వేలు తప్పుగా ఉంటున్నాయని లగడపాటి తెలిపారు. 

లగడపాటి వెల్లడించిన సర్వే వివరాలు

టీఆర్ఎస్ 35(ప్లస్ ఆర్ మైనస్ 10)
ప్రజాకూటమి 65 (ప్లస్ ఆర్ మైనస్ 10)
బీజేపీ 07 (ప్లస్ ఆర్ మైనస్ 02)
ఎంఐఎం 06 -07
ఇండిపెండెంట్ 07-09

మరిన్ని వార్తలు

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల