Asianet News TeluguAsianet News Telugu

"హరీ"ష్: కేటీఆర్ దే పెత్తనం, అసంతృప్తులకు బుజ్జగింపులు

స్థానిక విభేదాలను పరిష్కరించుకోవడానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వంటి నేత కూడా కేటిఆర్ వద్దనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని బట్టి భవిష్యత్తులో కేసిఆర్ స్థానం కేటిఆర్ దేనని తేలిపోయిందని అంటున్నారు.

KTR is the boss in TRS after KCR
Author
Hyderabad, First Published Oct 1, 2018, 6:45 PM IST

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వారసుడు కేటి రామారావేనని స్పష్టంగా తేలిపోయింది. హరీష్ రావును దాదాపుగా పక్కన పెట్టినట్లేనని భావిస్తున్నారు. టికెట్ల కేటాయింపులోనూ, అసంతృప్తులను బుజ్జగించడంలోనూ కేటిఆరే కీలక పాత్ర పోషిస్తున్నారు. 

స్థానిక విభేదాలను పరిష్కరించుకోవడానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వంటి నేత కూడా కేటిఆర్ వద్దనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని బట్టి భవిష్యత్తులో కేసిఆర్ స్థానం కేటిఆర్ దేనని తేలిపోయిందని అంటున్నారు. 

ముథోల్, స్టేషన్ ఘనపూర్, నిర్మల్ అసమ్మతి నేతలను పిలిపించుకుని కేటిఆర్ మాట్లాడారు. ఈ నియోజకవర్గాల్లోని ఇరు వర్గాలను పిలిపించుకుని కేటీఆర్ సోమవారం మాట్లాడారు. స్టేషన్ ఘనపూర్ లో రాజయ్య, కడియం శ్రీహరి వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ స్థితిలో ఇరు వర్గాలు కేటిఆర్ తో సమావేశమయ్యారు. 

కడియం శ్రీహరి కూడా కేటిఆర్ వద్ద కూర్చుని విభేదాలను పరిష్కరించుకోవాల్సి వచ్చింది. అభ్యర్థులను మార్చేది లేదని గులాబీ బాస్ కేసిఆర్ స్పష్టం చేశారు. కేటిఆర్ ఇరు వర్గాలతో మాట్లాడిన తర్వాత కేసిఆర్ ఆ విషయం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తాటికొండ రాజయ్య ఊపిరి పీల్చుకున్నారు. 

నిర్మల్ అసమ్మతి నేత శ్రీహరిరావును పిలిపించుకుని కేటిఆర్ మాట్లాడారు. శ్రీహరి రావును బుజ్జగించి అధికారిక అభ్యర్థికి ఇబ్బంది లేకుండా కేటిఆర్ చూశారు. 

వచ్చే శాసనసభ ఎన్నికల బాధ్యత మొత్తం కేసిఆర్ తన తనయుడు కేటీఆర్ మీదే పెట్టినట్లు కనిపిస్తోంది. దీంతో హరీష్ రావు టీఆర్ఎస్ లో ద్వితీయ శ్రేణికి వెళ్లిపోయారనే మాట వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?

పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు ఓటేస్తే...: ఏపీకి ప్రత్యేక హోదాపై హారీష్ ట్విస్ట్

నిజమా?: హరీష్ రావుతో భేటీకి కేసిఆర్ నో

టీఆర్ఎస్ లో ఇంటి పోరు..హరీశ్ కు పొగబెడుతున్న కేసీఆర్: రఘునందన్ రావు

Follow Us:
Download App:
  • android
  • ios