Asianet News TeluguAsianet News Telugu

కూకట్ పల్లిలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పై కేసు

బాలీవుడ్‌ నటుడు హృతిక్ రోషన్‌పై హైదరాబాదులోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్‌ నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తూ వ్యాయామానికి స్లాట్ ఇవ్వడం లేదని శశి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 

KPHB Police registered cheating case on actor Hrithik Roshan
Author
Hyderabad, First Published Jul 4, 2019, 6:54 AM IST

హైదరాబాద్: బాలీవుడ్‌ నటుడు హృతిక్ రోషన్‌పై హైదరాబాదులోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్‌ నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తూ వ్యాయామానికి స్లాట్ ఇవ్వడం లేదని శశి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 

ఫిట్‌నెస్ ప్యాకేజీ పేరిట రూ. 17,490 నుంచి 36,400 వరకూ వసూలు చేశారని, ప్రశ్నిస్తే వెబ్‌సైట్‌‌లో బ్లాక్ చేస్తున్నారని శశి ఆరోపించారు. కూకట్‌పల్లి శేషాద్రి నగర్‌కు చెందిన ఐనేని శశికాంత్ అనే వ్యక్తి కె.పి.హెచ్.బి. కాలనీలోని కల్ట్.ఫిట్ జిమ్ లో నిరుడు డిసెంబర్ 26వ తేదీన సభ్యత్వం తీసుకున్నాడు. 

సభ్యత్వం తీసుకున్న సమయంలో బరువు తగ్గించటమే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కావల్సిన శిక్షణ తమ జిమ్‌లో లభిస్తుందని నిర్వాహకులుహమీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ జిమ్ సామర్థ్యాన్ని మించి మొత్తం 1800 మంది సభ్యులను జిమ్‌లో చేర్చుకున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో సరైన శిక్షణ లభించకపోగా, వ్యాయమం చేసేందుకు వసతి కూడా లేకపోవడంతో శశికాంత్ ఇదే సమస్యను జిమ్ డైరెక్టర్లకు ఫిర్యాదు చేసాడు. 

సమస్యను పరిష్కరించాల్సిన వారు, పరిష్కారం చేయడానికి బదులు శశికాంత్‌ను జిమ్‌కు రాకుండా అతడి కల్ట్.ఫిట్ యాప్‌ను నిలిపి వేశారు. దీంతో మోసపూరిత హామీలతో అమాయకులను మోసం చేస్తున్నారని కల్ట్.ఫిట్ సంస్థ డైరెక్టర్లు ముఖేష్ బన్సాల్, అంకిత్ అగోరి, షణ్ముగవేల్ మణి సుబ్బయ్యలతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హీరో హృతిక్ రోష‌న్‌పై శశి ఫిర్యాదు చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios